
ముంబై: గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన రిషభ్ పంత్.. ఈ పరాజయం తీవ్ర బాధకు గురిచేసిందన్నాడు. ఇక నుంచైనా ఈ తరహా మ్యాచ్‌లను గెలవడం అలవాటు చేసుకోవాలన్నాడు. ఇలా చివరి క్షణంలో రెండు, మూడు మ్యాచ్‌లు ఓడిపోయామన్నాడు. తమ బ్యాటర్లు చేస్తున్న 30, 40 పరుగులను పెద్ద స్కోర్లుగా మల్చాల్సిన అవసరం ఉందన్నాడు. వరుసగా వికెట్లు కోల్పోవడంతోనే ఈ మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని తెలిపాడు.
'ఈ పరాజయం తీవ్ర బాధకు గురి చేసింది. ఇక నుంచైనా చివరి క్షణంలో చేజారే ఈ మ్యాచ్‌లను గెలవడం అలవాటు చేసుకోవాలి. గత రెండు మూడు మ్యాచ్‌లుగా ఇలానే చివరి క్షణంలో ఓటమిపాలయ్యాం. బౌలర్లు ఆరంభంలో విఫలమైనా తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. ఈ తరహా వికెట్‌పై బౌలర్ల మద్దతు దొరికితే సరిపోదు. బ్యాటింగ్‌లో కూడా రాణించాలి. మిచెల్ మార్ష్ అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్ యూనిట్‌గా మేం చేస్తున్న 30, 40 పరుగలను భారీ స్కోర్లుగా మలచాల్సిన అవసరం ఉంది. టీమ్‌గా చాలా సానుకూల అంశాలున్నాయి. తప్పిదాలపై చర్చించి తదుపరి మ్యాచ్‌కు మెరుగ్గా బరిలోకి దిగుతాం'అని పంత్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77), దీపక్ హుడా(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసింది. అక్షర్ పటేల్(24 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 42 నాటౌట్), రిషభ్ పంత్(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 44), మిచెల్ మార్ష్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37) రాణించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బ్యాటర్ల ఉరుకులాట ఆ జట్టు ఓటమికి కారణమైంది. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ తీసారు. ఈ విజయంలో లక్నో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది.