ఈ విజయం నా బర్త్‌డే కానుక కాదు: రిషభ్ పంత్

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధించిన విజయం తన పుట్టిన రోజు కానుక కాదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. ఇదో గొప్పవిజయమని, కచ్చితంగా తమ జట్టును టాప్2లో నిలిచేలా చేస్తుందన్నాడు. చెన్నైతో సోమవారం ఆఖరి ఓవర్ వరవకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 4( మంగళవారం)తో రిషభ్ పంత్ 24వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్‌ను ఈ విజయం బర్త్‌డే కానుక? అని ప్రశ్నించగా.. కాదని బదులిచ్చాడు.

బర్త్‌డే గిఫ్ట్ కాదు..
ఇది ఓ కష్టతరమైన మ్యాచ్ అని చెప్పాడు. చిన్న టార్గెట్ అయినప్పటికీ పృథ్వీ షా, శిఖర్ ధావన్ ధాటిగా ఆడారని, చివర్లో హెట్‌మైర్ తమ పనిని పూర్తి చేశాడన్నాడు. 'ఈ విజయం నా పుట్టినరోజు కానుక కాదు. ఇదో కష్టతరమైన మ్యాచ్. చివరికి మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. తొలుత పవర్‌ప్లేలో చెన్నై బ్యాట్స్‌మెన్ బాగా ఆడారు. తర్వాత మేం కొన్ని ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాం. చివర్లో అంబటి రాయుడు బాగా ఆడటం వల్ల చెన్నై కొన్ని ఎక్కువ పరుగులు సాధించింది.

అందుకే ప్రమోషన్..
ఇక మా ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా(18) ఆరంభంలోనే మూడు ఫోర్లు కొట్టి శుభారంభమిచ్చాడు. అతనికి ధావన్ అండగా ఉండి సహకరించాడు. ఇది చిన్న లక్ష్యమే కావడంతో మొదటి నుంచీ పోటీలోనే ఉన్నాం. చివర్లో హెట్‌మైర్ మా పని పూర్తి చేశాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్‌ను కాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపడానికి ప్రత్యేక కారణాలు లేవు. లెప్ట్ రైడ్ కాంబినేషన్ కోసమే అలా అతనికి బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చాం. చివరికి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. అయితే, ఇది మాకు చాలా పెద్ద విజయం. ఎందుకంటే ఇది మమ్మల్ని కచ్చితంగా టాప్ 2లో నిలిచేలా చేస్తుంది' అని పంత్ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన ధావన్, హెట్‌మైర్..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా... 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అక్షర్ పటేల్ (2/18) చెన్నైని దెబ్బ తీశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), హెట్‌మైర్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 28 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్స్ టేబుల్లో టాప్‌కు దూసుకెళ్లింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications