For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క ఓవర్ మా ఓటమిని శాసించింది: రిషభ్ పంత్

Rishabh Pant says Mustafizur Rahmans over was game changer after RCB beat DC

ముంబై: ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయకపోవడంతో పాటు మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి కారణమైందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ 16 పరుగులతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిషభ్ పంత్.. ముస్తాఫిజుర్ వేసిన 18వ ఓవర్‌ తమ ఓటమిని శాసించిందన్నాడు. డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని అందించినా మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం దెబ్బతీసిందని చెప్పాడు.

ఆ ఒక్క ఓవర్ గేమ్ చేంజర్..

ఆ ఒక్క ఓవర్ గేమ్ చేంజర్..

'డేవిడ్ వార్నర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అద్భుతమైన ఆరంభంతో మ్యాచ్ గెలిచే అవకాశాన్ని అందించాడు. మిడిల్ ఓవర్లలో నెమ్మదిగా ఆడటం మా ఓటమికి కారణమైంది. అయితే దీనికి మిచెల్ మార్ష్‌ను నిందించలేం. ఇన్నింగ్స్ సాగుతున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఇక ముస్తాఫిజుర్ వేసిన ఎక్స్‌పెన్సివ్ ఓవర్ గేమ్ చేంజర్‌ అయింది. మూమెంటమ్‌ను మార్చేసింది. మేం మా ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయాల్సింది. కానీ మేం విఫలమయ్యాం.

డీకే బ్యాటింగ్ అద్భుతం..

డీకే బ్యాటింగ్ అద్భుతం..

స్లాగ్ ఓవర్లలో దినేశ్ కార్తీక్ ఆడిన తీరు అద్భుతం. ఒక బౌండరీ చిన్నగా ఉండటంతో ప్రతీ బ్యాటర్ ఆ వైపే ఆడేందుకు ప్రయత్నించారు. దాంతో నేను కుల్దీప్ ఎండ్‌ను మార్చి బౌలింగ్ చేయించా. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక జట్టుగా మెరుగవ్వడంపై మేం దృష్టిసారిస్తాం. మా తప్పిదాలను తెలుసుకొని తదుపరి మ్యాచ్‌ల్లో పునరావృతం కాకుండా చూసుకుంటాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

6 బంతుల్లో 6 బౌండరీలు..

6 బంతుల్లో 6 బౌండరీలు..

ముస్తాఫిజుర్ వేసిన 18వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ చెలరేగాడు. 6 బంతుల్లో 6 బౌండరీలు బాది గేమ్ మూమెంటమ్‌ను మార్చేసాడు. తొలి మూడు బంతులను బౌండరీలుగా బాదిన కార్తీక్.. ఆ తర్వాత రెండు సిక్స్‌లు బాదాడు. చివరి బంతిని కూడా బౌండరీ బాది 28 పరుగులు పిండుకున్నాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్‌తో 160 పరుగుల లోపే పరిమితమవుతుందనుకున్న ఆర్‌సీబీ స్కోర్ 190కి చేరింది. ఇక 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన ఘనతను కూడా కార్తీక్ అందుకున్నాడు.

కార్తీక్ విజయం..

కార్తీక్ విజయం..

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్‌) తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 55) అర్ధ సెంచరీ సాధించగా, షహబాజ్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 32 నాటౌట్‌) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు 66), రిషభ్‌ పంత్‌ (17 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 34) మెరిశారు. బెంగళూరు బౌలర్లు హేజల్‌వుడ్‌ (3/28), సిరాజ్‌ (2/31) రాణించారు.

Story first published: Sunday, April 17, 2022, 9:31 [IST]
Other articles published on Apr 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+