
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకోగా.. కేకేఆర్‌లో మూడు మార్పులు జరిగాయి. ఢిల్లీలో ఖలీల్ అహ్మద్ స్థానంలో చేతన్ సకారియా ఆడనుండగా.. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో మిచెల్ మార్ష్ బరిలోకి దిగుతున్నాడు. ఇక జట్టులోని మార్పులకు గల కారణాన్ని టాస్ సందర్భంగా రిషభ్ పంత్ వెళ్లడించాడు.
అందుకే ఈ మార్పులు..
ఖలీల్ అహ్మద్ తొడ కండరాల గాయంతో బాధపడుతుంటంతోనే ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పాడు. కరోనా వైరస్ నుంచి మిచెల్ మార్ష్ కోలుకోవడంతో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు.'వికెట్ డ్రైగా కనపిస్తుంది. అంతేకాకుండా మ్యాచ్ చివర్లో డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే ఫీల్డింగ్ తీసుకుంటున్నా. ఒకరికొకరు అండగా ఉండటమే మా జట్టు బలం. మాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. వాటిని కలిసికట్టుగానే ఎదుర్కొన్నాం. జట్టులో రెండు మార్పులు చేశాం. ఖలీల్, సర్ఫరాజ్ ఉద్వాసనకు గురవ్వగా.. చేతన్ సకారియా, మిచెల్ మార్ష్ బరిలోకి దిగుతున్నారు. ఖలీల్ తొడకండరాల గాయంతో బాధపడుతుండటంతోనే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. మిచెల్ కొవిడ్ నుంచి కోలుకున్నాడు.'అని పంత్ చెప్పుకొచ్చాడు.
చేజింగ్ చరిత్ర నేపథ్యంలోనే తాము కూడా ముందు బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అయితే డ్యూ వచ్చే అవకాశం లేదనిపిస్తోంది. జట్టులోని ఆటగాళ్లంతా బాధ్యతంగా ఆడి విజయం కోసం కృషి చేస్తారని భావిస్తున్నానని తెలిపాడు. జట్టులో మూడు మార్పులు చేశామని, ఫించ్, హర్షిత్ రాణా, ఇంద్రజీత్ తుది జట్టులోకి వచ్చారని చెప్పాడు. తమ కాంబినేషన్ సెట్ అవ్వకనే గత కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయామని చెప్పాడు. అందుకే సరైన కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ జట్టు మిగిలిన ఆరు మ్యాచ్‌లకు ఆరు గెలవాలన్నాడు.
ప్రస్తుతం ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఏడో స్థానంలో ఉంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ గత 4 మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే ఆత్రుతతో ఉంది.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్,మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: ఆరోన్ ఫించ్, సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, వెంకటేశ్ అయ్యర్, బాబా ఇంద్రజిత్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా