జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడి గెలిపిస్తే ఆ కిక్కే వేరు.. ఈ సెంచరీ జీవితాంతం గుర్తుంచుకుంటా: రిషభ్ పంత్

లండన్: జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు భారీ ఇన్నింగ్స్ ఆడి గెలిపిస్తే ఆ కిక్ వేరేలా ఉంటుందని టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన కీలక మూడో వన్డేలో రిషభ్ పంత్(113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 125 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లోపడ్డ భారత జట్టును రిషభ్ పంత్.. హార్దిక్ పాండ్యా(55 బంతుల్లో 10 ఫోర్లతో 71)తో కలిసి ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు.

ఆ కిక్కే వేరప్పా..
మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేసిన పంత్.. ఈ సెంచరీని జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపాడు. తనకు ఇంగ్లండ్‌లో ఆడటం ఎప్పుడూ మజాగా ఉంటుందని చెప్పాడు. ఈ సిరీస్ విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఉందని చెప్పాడు.'ఈ ఇన్నింగ్స్ నా జీవితాంతం గుర్తించుకుంటా. ఎందుకంటే ఇది వన్డే ఫార్మాట్‌లో నా మొదటి సెంచరీ, అదీ కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి గెలిపిస్తే... ఆ కిక్ వేరేగా ఉంటది.

ఇంగ్లండ్‌లో ఆడటం భలే మజా..
నేను సెంచరీ చేయాలని, భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఏ మాత్రం అనుకోలేదు. బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఫేస్ చేయబోయే బాల్‌ను ఎలా ఆడాలని మాత్రమే ఆలోచిస్తాను. ఇంగ్లండ్‌లో ఆడటం ఎప్పుడూ భలే మజాగా ఉంటుంది. ఎక్కువ మ్యాచ్‌లు ఆడే కొద్దీ అనుభవం పెరుగుతూ ఉంటుంది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్‌కు చక్కగా సహకరిస్తోంది. ఇలాంటి పిచ్‌పై ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాం అంటే దానికి బౌలర్లే కారణం. ఈ మ్యాచ్‌లోనే కాదు, సిరీస్ మొత్తంలో వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

పంత్ ప్రతాపం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (80 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), జేసన్ రాయ్ (31 బంతుల్లో 7 ఫోర్లతో 41) రాణించారు. హార్దిక్ పాండ్యా (4/24) వన్డే కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా... చహల్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసి గెలిచింది. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా రాణించారు. పంత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'... హార్దిక్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications