ఆ ఆటగాడిని వదులుకుని ఆర్సీబీ పెద్ద తప్పుచేసింది.. వేలంలో అలాంటి ప్లేయర్ దొరకడు: గంభీర్

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసం ఫిబ్రవరిలో జరగబోయే మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ వాళ్ల రిటెన్షన్ ప్లేయర్స్, వదిలేసిన ప్లేయర్స్ జాబితాను బుధవారం ప్రకటించాయి. కొన్ని టీమ్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్‌ను వదిలేసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక అన్ని ఫ్రాంచైజీలు 6-7 మందిని వదిలించుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాత్రం ఏకంగా 10 మందిని వదిలేసింది. ఆర్సీబీ నిర్ణయంపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు.

అతిపెద్ద సమస్య అదే:
బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తాజాగా 'క్రికెట్ కనెక్టెడ్' కార్యక్రమంలో మాట్లాడుతూ... 'బెంగళూరు జట్టు ప్రతి ఏడాది జట్టులో భారీ మార్పులు చేస్తోంది. ఇదే ఆ జట్టుకు అతిపెద్ద సమస్యగా మారింది. ఇలా చేయడంతో జట్టులో భాగమైన ఆటగాళ్లు అభద్రతకు లోనవుతారు. మనం కూడా బాగా ఆడకపోతే వచ్చే ఏడాది ఆడమేమో అని ఆలోచిస్తారు. ఇది కోచ్‌లు మరియు మార్గదర్శకులకు కూడా సమస్యే. వారి స్థానాలను కాపాడటానికి ఆటగాళ్లను నిందించలేరు' అని అన్నాడు.

మోరిస్‌కు ఒక అవకాశం ఇవ్వాల్సింది:
'ఆర్సీబీ వదులుకున్న ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఉన్నాడు. అతడిని వదులుకుని పెద్ద తప్పుచేసింది. అతడిని కొనసాగించాల్సి ఉండే. గాయాల బారిన పడిన అతడికి మరో అవకాశం ఇవ్వాల్సింది. మోరిస్ లాంటి ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ మళ్లీ వేలంలో చేజిక్కించుకోలేదు. ఐపీఎల్ వేలంలో మేటి ఆల్‌రౌండర్లు దొరకరు. నేను కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడేటప్పుడు ఆండ్రీ రసెల్ ఇలాగే గాయాలబారిన పడినప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. ఆర్సీబీ కూడా మోరిస్‌కు ఒక అవకాశం ఇవ్వాల్సింది' అని మాజీ ఓపెనర్ సూచించాడు. యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో మోరిస్ 9 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో కేవలం 34 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్‌లో 11 వికెట్లు తీశాడు.

వారినీ తీసేస్తారనుకున్నా:
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్సీబీ క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్ మైక్ హెసన్, ప్రధాన కోచ్ సైమన్ కటిచ్‌ను కొనసాగించడం విశేషమని గౌతీ అన్నాడు. అసలు వాళ్లను కూడా ఆర్సీబీ తొలగిస్తుందని తాను భావించినట్లు గంభీర్ కొంటెగా విమర్శించాడు. ఇక క్రిస్ మోరిస్ స్థానంలో ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను తీసుకొంటే ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు.. దక్షిణాఫ్రికా ఆటగాడికి ఉన్నంత అనుభవం ఈ ఆసీస్ క్రికెటర్‌కు లేదన్నాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లిస్ట్:
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్: విరాట్ కోహ్లీ, డివిలియర్స్, దేవ్‌దత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, చాహల్, జోషువా ఫిలిప్, పవన్ దేవ్‌పాండే, షాబాజ్ అహ్మద్, ఆడమ్ జంపా
రిలీజ్ చేసిన ప్లేయర్స్: క‌్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మోయిన్ అలి, ఇసురు ఉడానా, డేల్ స్టెయిన్, శివమ్ దూమే, ఉమేష్ యాదవ్, పవన్ నేగి, గుర్‌కీరత్ మాన్, పార్థివ్ పటేల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!