Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోడ్డు ప్రమాదంతో జీవితం విలువ తెలిసింది: రిషభ్ పంత్

 Rishabh Pant says Found happiness in being able to brush my teeth

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంతో జీవితం విలువ ఏంటో తెలిసిందని, చిన్న పనులను కూడా ఆస్వాదిస్తున్నానని టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. పళ్లు తోముకోవడం దగ్గర నుంచి సూర్యుని కింద కూర్చోవడం వంటి రోజు వారి పనులు చేయాడాన్ని కూడా సంతోషంగా ఫీలవుతున్నానని తెలిపాడు. ఊహించని రోడ్డు ప్రమాదంతో ఇంటికే పరిమితమైన రిషభ్ పంత్.. గాయాల నుంచి కోలుకుంటున్నాడు. డిసెంబర్ 30న రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పూర్తిగా దగ్దమైన విషయం తెలిసిందే.

అదృష్టవశాత్తు ఓ బస్సు, కండక్టర్ సాయంతో ప్రాణాలతో బయటపడిన పంత్.. తీవ్ర గాయాలతో ఆటకు దూరమయ్యాడు. మొకాలితో పాటు పంత్ ముఖానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో పంత్ కోలుకుంటున్నాడు. ఇటీవలే ఊత కర్ర సాయంతో నడక మొదలు పెట్టిన పంత్.. తాజాగా ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడాడు. తన రికవరీ ప్రాసెస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

నా ఆలోచన విధానమే మారింది..

నా ఆలోచన విధానమే మారింది..

'ప్రస్తుతం నా పరిస్థితి మెరుగ్గా ఉంది. చాలా వేగంగా కోలుకుంటున్నాను. ఆ దేవుని దయతో పాటు మెడికల్ టీమ్ సహకారంతో అతి త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని, ఫిట్ అవుతానని ఆశిస్తున్నా. ప్రస్తుతం నా చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి చెప్పడం నాకు కష్టంగా ఉంది. అయితే రోడ్డు ప్రమాదం తర్వాత నా జీవితాన్ని భిన్నమైన దృక్కోణంతో చూస్తున్నాను. చిన్న చిన్న పనులను కూడా ఆస్వాదిస్తున్నాను. ఉరకుల పరుగుల జీవితంలో చాలా మంది ఈ చిన్న చిన్న విషయాలను ఆస్వాదించలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత నేను చేసే ప్రతీ పనిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నా.

బ్రష్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా..

బ్రష్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా..

చివరకు బ్రష్ చేయడాన్ని, సూర్యని కింద కూర్చోవడం వంటి పనులను ఆస్వాదిస్తున్నా. మన లక్ష్యాలను సాధించే క్రమంలో ఇలాంటి చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోం. కానీ రోడ్డు ప్రమాదం తర్వాత జీవితంలో ప్రతీ రోజు గొప్పదనే విషయం నాకు తెలిసొచ్చింది. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాను. అది పాజిటీవ్ అయినా నెగటీవ్ అయినా మనకు అనుకూలంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యా.

షెడ్యూల్ ప్రకారం నా రోజు వారి పనులను ఫాలో అవుతున్నా.

 రోజంతా.. ఫిజియోథెరపినే..

రోజంతా.. ఫిజియోథెరపినే..

ఉదయం లేవగానే ఫిజియోథెరపిస్ట్ సాయంతో తొలి ఫిజియోథెరపి సెషన్‌లో పాల్గొంటున్నా. ఆ తర్వాత కాస్త విరామం తీసుకొని రిఫ్రెష్ అయ్యి సెకండ్ సెషన్‌కు సిద్దమవుతున్నా. సెకండ్ సెషన్ త్వరగా ప్రారంభించి ఎంత నొప్పిని భరించగలుగుతున్నాననే విషయాన్ని గ్రహిస్తున్నా. సాయంత్రం చివరి సెషన్‌తో నా రోజును ముగిస్తున్నా. ఈ మధ్య‌లో మెడికల్ టీమ్ సూచనల మేరకు పండ్లు, పానియాలు తీసుకుంటున్నా. సూర్యని కింద కొంత సేపు కూర్చునే ప్రయత్నం చేస్తున్నా. ఈ విధానం నేను పూర్తిగా కోలుకునేవరకు సాగనుంది.

డియర్ ఫ్యాన్స్..

డియర్ ఫ్యాన్స్..

నేను కోలుకోవాలని చాలా మంది మెసేజ్‌లు చేశారు. నాకు ఇంత మంది శ్రేయోభిలాషులు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. నా అభిమానులను నేను కోరేది ఒక్కటే. భారత జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ ప్రేమను ఇలానే పంపిస్తూనే ఉండండి. వాటికి తర్వలోనే రెట్టింపుగా ప్రేమను తిరిగిస్తా. నా ఆటతో మిమ్మల్ని సంతోష పరుస్తా.'అని పంత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, February 28, 2023, 20:15 [IST]
Other articles published on Feb 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+