
గాయం గురించి మర్చిపోయా
స్పోర్ట్స్ టుడేలో బోరియా మజుందార్‌తో మాట్లాడిన రిషభ్ పంత్ పలు విషయాలు పంచుకున్నాడు. 'నేను విన్నింగ్ షాట్ ఆడినప్పుడు.. బంతి బ్యాట్ చివరకు తగిలిందని భావించాను. అవుట్ ఫీల్డ్ కూడా నెమ్మదిగా ఉంది. అందుకే రెండు కాదు మూడు పరుగులు తీయాలని నాన్-స్ట్రైకర్ నవదీప్ సైనీతో అన్నాను. సైనీ గాయం గురించి మర్చిపోయి వేగంగా పరుగెత్తా. మొదటి పరుగు పూర్తి చేశా. రెండో పరుగు తీస్తున్నప్పుడు.. మిడ్-ఆఫ్ ఫీల్డర్ బంతిని ఛేజ్ చేయలేడని అర్ధమైంది. బంతి బౌండరీ వెళ్లింది. ఆనందంలో మునిగిపోయా. అయితే ఆ సమయంలో సైనీ ఒక కాలితో పరుగెత్తుతున్నాడు. అప్పుడు గాయం విషయం గుర్తుకువచ్చింది. అప్పుడు సరదాగా అనిపించింది' అని పంత్ తెలిపాడు.

విజయానికి ఇంకా 3 పరుగులే
గబ్బా టెస్ట్ చివరి రోజు మూడో సెషన్‌లో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ వికెట్లను భారత్ వెంటవెంటనే కోల్పోయింది. అప్పటికి భారత్ 7 వికెట్లకు 325 పరుగులు చేసింది. విజయానికి ఇంకా కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం. రిషభ్ పంత్, నవదీప్ సైనీ క్రీజులో ఉన్నారు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ వేసిన బంతిని పంత్ షాట్ ఆడాడు. మిడ్-ఆఫ్ ఫీల్డర్ మీదుగా బంతి బౌండరీ వెళ్లింది. బౌండరీ వెళ్లదని భావించిన పంత్.. సైనీకి గాయం అయిన విషయం మరచిపోయి 33 పరుగులు తీయాలని అన్నాడు. ఆపై గాయం విషయం అతడికి గుర్తుకువచ్చింది.

మరో 30 నిమిషాలు క్రీజులో ఉంటే
'సిడ్నీ టెస్టులో సెంచరీ కోల్పోయాను. అయితే మరో 30 నిమిషాలు లేదా గంట సేపు నేను క్రీజులో ఉంటే మరో విజయం సాధించేవాళ్లం. ఆ సమయంలో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి అన్నిసార్లు అలాంటి అవకాశాలు రావు. కానీ తర్వాత మ్యాచ్‌లోనే నాకు అలాంటి సందర్భం ఎదురైంది. దీంతో జట్టును గెలిపించాలని భావించా. దానిపైనే దృష్టిసారించి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి విజయం సాధించా' అని పంత్ చెప్పాడు.

పంత్ ఔటైన తర్వాత
సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ 97 పరుగులు సాధించాడు. అయితే అతడు క్రీజులో ఉన్నంతసేపు భారత్ ఫేవరేట్‌గా నిలిచింది. కానీ పంత్ ఔటైన తర్వాత మ్యాచ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టుబిగించింది. కానీ రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి అద్భుత పోరాటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రిషభ్ పంత్ ప్రమోషన్ వ్యూహం నాది కాదు.. ఆ ఘనత పూర్తిగా విరాట్ కోహ్లీదే: విక్రమ్


Click it and Unblock the Notifications












