టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్.. ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో రెండేళ్ల పాటు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్.. బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌తో పునరాగమనం చేశాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.
ఓవైపు పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండి బ్యాటింగ్‌కు కష్టంగా మారినా అటాకింగ్ గేమ్‌తో పరుగులు రాబడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించిన రిషభ్ పంత్.. ఇందులో 6 బౌండరీలు బాదాడు.

రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులోకి వచ్చి రావడంతో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. అది కూడా క్రీజును ధాటి బౌలర్ తలపై నుంచి సిక్సర్ బాదాడు. అతను కొట్టిన ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రోహిత్ శర్మ(5), యశస్వి జైస్వాల్(10), విరాట్ కోహ్లీ(17) ఔటయ్యారనే బెరుకు లేకుండా.. పంత్ భారీ షాట్స్ ఆడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
షకీబ్ అల్ హసన్ వేసిన 21 ఓవర్‌లో చివరి రెండు బంతులను పంత్ బౌండరీకి తరలించాడు. ఐదో బంతిని స్వీప్ షాట్‌తో స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ తరలించిన పంత్.. మరుసటి బంతిని క్రీజు ధాటి బౌలర్ తలపై నుంచి సిక్సర్ బాదాడు. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు పంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'ఏం గుండెరా అది.. బౌలర్ తలపై నుంచే సిక్సా..?'అని కామెంట్ చేస్తున్నారు.
ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 3 వికెట్లకు 81 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(10), రోహిత్ శర్మ(5), విరాట్ కోహ్లీ(17) విఫలమైనా.. శుభ్‌మన్ గిల్(33 బ్యాటింగ్), రిషభ్ పంత్(12 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. రెండో రోజు పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడిచింది. మొత్తం 17 వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 308 పరుగులకు చేరింది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు 37 పరుగులు మాత్రమే జోడించింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది.