Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాలీవుడ్ హీరోయిన్‌‌లా రిషభ్ పంత్ అక్క.. పడి చస్తున్న కుర్రాళ్లు!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఢిల్లీలోని ఓ సిక్కు దేవాలయంలో భోజనం చేస్తూ క్రికెట్‌ ప్రాక్టీస్ చేశాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన పంత్.. ఆత్మవిశ్వాసంతో గాయాల నుంచి కోలుకొని భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రమాద సమయంలో పంత్‌కు అతని సోదరి సాక్షి పంత్ అండగా నిలిచింది. ఈ విషయాన్ని అతనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే సాక్షి పంత్.. సోషల్ మీడియా వేదికగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. దాంతోనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విపరీతంగా ఫాలోవర్స్‌ కలిగి ఉన్న పాపులర్ సెలబ్రిటీల జాబితాలో సాక్షి పంత్ చేరింది . ఈ యువతి రెగ్యూలర్‌గా షేర్ చేసే ఫోటోలు, వీడియోలకు కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతూ కామెట్స్ షేర్ చేస్తున్నారు.

Rishabh Pant s Sister Sakshi Pant Has 200K Instagram Followers

పంత్‌కు అక్క క్రేజీ ఫ్యాన్ బేస్..
సాక్షి పంత్.. చదువుతో పాటు ప్రొఫెషనల్ కెరీర్‌, ఫ్యామిలీ రిలేషన్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకే సోషల్ మీడియాలో ఆమెకు క్రేజీ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. సాక్షి పంత్ బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఎంబీఏ చదివింది. ఓవైపు తన ఫ్యామిలీ మొత్తం క్రికెట్ ప్రపంచంతో మమేకమైనా.. ఆమె మాత్రం తన చదవుపై మాత్రం ఫోకస్ పెట్టింది.
దాంతో చదువులో ప్రతిభ కనబర్చి బ్రిటన్‌లోనే ప్రొఫెషనల్ కెరీర్‌ బిల్డ్ చేసుకుంది. లిస్టర్ హాస్పిటల్స్ వంటి ప్రముఖ ఆర్గనైజేషన్స్‌లో పనిచేసింది. ప్రస్తుతం నేషనల్ ఫార్మసీ అసోసియేషన్‌లో సాక్షి పంత్ ఉద్యోగం చేస్తోంది. రిషభ్ పంత్ సోదరిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

ప్రేమ వివాహానికి రెడీ..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారి తన స్టైలిష్ లైఫ్‌స్టైల్, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాల తరుచూ పంచుకుంటుంది. ఆమె పోస్ట్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సాక్షి పంత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

సాక్షి పంత్ లండన్‌కు చెందిన వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమైంది. 10 ఏళ్ల పాటు అతనితో ప్రేమలో మునిగి తేలిన సాక్షి పంత్.. కుటుంబ సభ్యుల‌ను ఒప్పించి నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు.
ఎలైట్ E2 (Elite E2) అనే కంపెనీలో అంకిత్ చౌదరి బోర్డు మెంబర్‌గా ఉన్నారు. ఈ కంపెనీ ఎడ్యుకేషన్, ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్స్‌పై ఫోకస్ చేసి పనిచేస్తుంది.

Story first published: Wednesday, January 22, 2025, 17:10 [IST]
Other articles published on Jan 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+