రిషభ్ పంత్‌కు హెడెక్‌గా మారిన ఊర్వశి రౌటేలా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ..(వీడియో)

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి హెడెక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా పదే పదే బోల్డ్ కామెంట్స్‌తో పంత్ స్థాయిని ఈ బాలీవుడ్ బ్యూటీ దిగజార్చింది. దాంతో పంత్ ఘోర అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతలా అంటే.. పంత్ కనబడితే అభిమానులు.. ఊర్వశి ఊర్వశి అని అరిచేంత. పాకిస్థాన్‌తో గత ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంత్‌కు ఈ ఊహించని ఘటన ఎదురైంది. దినేశ్ కార్తీక్ కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన పంత్.. టీమిండియా 12వ ప్లేయర్‌గా సేవలందించాడు.
ఊర్వశి.. ఊర్వశి అంటూ...
బౌండరీ లైన్ వద్ద వాటర్ బాటిల్‌తో ఉన్న పంత్‌ను కొంత మంది ఆకతాయిలు ఊర్వశి ఊర్వశి అని కామెంట్ చేశారు. అయినా ఈ వ్యాఖ్యలను పంత్ విని వినిపించనట్లు వ్యవహరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత వికెట్ కీపర్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన పంత్‌ను ఇంతలా అవమానపరచడం కరెక్ట్ కాదని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా భవిష్యత్తు సారథి అయ్యే అవకాశాలున్న పంత్‌ను ఓ బాలీవుడ్ బ్యూటీ చెప్పింది నమ్మి ట్రోల్ చేయడం సమంజసం కాదని హితవు పలుకుతున్నారు.

తనతో సెక్స్ చేయడానికి..
రిషభ్ పంత్ తనతో సెక్స్ చేయడానికి తెగ ఆరాటపడ్డాడని సంచలన ఆరోపణలు చేసిన ఊర్వశీ రౌటేటా.. ఆసియా కప్ ముందు సోషల్ మీడియా వేదికగా అతనితో వాగ్వాదానికి దిగింది. రిషభ్ పంత్ పేరును ప్రస్తావించకుండా తన కోసం హోటల్ గదిలో వేచి చూసాడని ఓ ఇంటర్వ్యూలో రౌటేలా చెప్పగా.. పాపులారిటీ కోసం ఇంత దిగుజారుతారా? అంటూ భారత వికెట్ కీపర్ కౌంటరిచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఊర్వశీ బ్యాట్ బాల్ ఆడుకోవాలని, నకరాలు చేస్తే ఇజ్జత్ తీస్తానని హెచ్చరించింది.

పిల్ల బచ్చా అంటూ..
'అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చాల వల్ల బద్నాం అవ్వడానికి. ఆర్‌పీ చోటు భయ్యా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే పురుషుడు). నీ ఇజ్జత్ తీస్తా'అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనికి ఆర్‌పీ చోటు భయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది. దీనికి పంత్ సైతం తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. మన ఆధీనంలో లేని విషయాలను ఏ మాత్రం పట్టించుకోవద్దని బదులిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications