Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రిషభ్ పంత్.. ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్‌కు అంత పవరుందా?

Rishabh Pants old picture with Ashish Nehra goes viral

న్యూఢిల్లీ: టీమిండియా విధ్వంసకర వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషబ్‌ పంత్‌కు చెందిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌తో శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కిన పంత్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దాంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతని పేరు నెట్టింట మారుమోగుతోంది.

ఈ క్రమంలోనే అతని చిన్ననాటి ఓ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా నుంచి పంత్ తన బ్యాట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకుంటున్నాడు. దాంతో ఈ ఫొటో సోషల్‌ మీడియా వేదికగా ఓ కొత్త చర్చకు దారితీసింది. గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కూడా తన చిన్నతనంలో అచ్చం ఇలానే ఆశిష్‌ నెహ్రాతో ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటో కూడా ఇప్పటికే ఎన్నో సార్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ రెండు ఫొటోలను పోలుస్తూ అభిమానులు ఓపెద్ద డిస్కషన్‌కే తెరలేపారు. ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్‌కు అంత పవరుందా? గతంలో కోహ్లీ సూపర్ స్టార్ అయ్యాడు.. ఇప్పుడు పంత్ అదరగొడుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీ, పంత్‌ల సక్సెస్‌కు నెహ్రా ఆటోగ్రాఫే కారణమని కొందరంటుంటే.. మరి కొందరేమో నెహ్రా హస్తవాసి చాలా బాగుందని.. ఆయన ఆటోగ్రాఫ్‌ తీసుకుంటే క్రికెటర్లు స్టార్లయిపోతారని కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు క్రికెటర్లు దేశవాళి క్రికెట్‌లో ఢిల్లీ జట్టకే ప్రాతినిధ్యం వహించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్‌ లారెన్స్‌ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్‌ (5/47), అక్షర్‌ పటేల్‌ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌ (174 బంతుల్లో 96 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. అశ్విన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'.... పంత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' పురస్కారాలు లభించాయి.

ఈ గెలుపుతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధించి న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. జూన్‌ 18 నుంచి 22 వరకు లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ నిర్వహిస్తారు. భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్‌లోనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది.

Story first published: Sunday, March 7, 2021, 20:08 [IST]
Other articles published on Mar 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+