
అహ్మదాబాద్: ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లేకు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. మొతేరా మైదానం వేదికగా శనివారం ముగిసిన చివరి టెస్ట్‌లో కోహ్లీసేన ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన పంత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఒక దశలో 143 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును పంత్.. సుందర్‌తో కలిసి గట్టెక్కించాడు. సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడమేగాకుండా సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ విజయానంతరం అవార్డు తీసుకోవడానికి వచ్చిన పంత్ ముందు హర్ష భోగ్లే సరదాగా కొన్ని ప్రశ్నలు ఉంచాడు.
'ఈ మధ్య వికెట్ల వెనుకాల నువ్వు చేసే వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే నువ్వే మాట్లాడే మాటలు స్పష్టంగా వినబడటం లేదని, కామెంటేటర్లు సైలెంట్‌గా ఉంటే వాటిని ఇంకా ఆస్వాదిస్తామని అభిమానులు అంటున్నారు.. దీనిపై నీ స్పందన ఏంటని ప్రశ్నించాడు. దీనికి పంత్ తనదైన శైలిలో బుదులిచ్చాడు. ''వాళ్లు చెప్పినదానిని నేనైతే పొగడ్తగా భావిస్తున్నా. అభిమానులు డిమాండ్ మేరకు మీరు మారండి'తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.
దాంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (174 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. అశ్విన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'.... పంత్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారాలు లభించాయి.
ఈ గెలుపుతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించి న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. జూన్ 18 నుంచి 22 వరకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్‌లోనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది.