Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rishabh Pant: అందుకే వరుసగా రివ్యూ తీసుకున్నాం!

 Rishabh Pant reveals why India went for DRS twice against Joe Root

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కోహ్లీసేన బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ మూడు విభాగాల్లో పర్వాలేదనిపిస్తోంది. మిడిలార్డర్ విఫలమైనా టాపార్డర్, లోయరార్డర్ రాణించడంతో బ్యాటింగ్‌లో మెరుగ్గా కనబడుతోంది. అయితే డీఆర్‌ఎస్ విషయంలో మాత్రం టీమిండియా దారుణంగా విఫలమవుతుంది. రెండు టెస్ట్‌ల్లోనూ కోహ్లీసేన పలు రివ్యూలను వృథా చేసింది. ఏది ఔట్, నాటౌటో అంచనా వేయలేకపోతుంది. తాజాగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ టీమిండియా రెండు ఓవర్ల వ్యవధిలో రెండు రివ్యూలను వృథా చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ మహమ్మద్ సిరాజ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

అయితే డీఆర్‌ఎస్‌లను వృథా చేయడంపై మ్యాచ్ అనంతరం వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్పందించాడు. బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ఇవన్నీ ఆటలో సహజమేనన్నాడు. 'బంతి వికెట్లను హిట్ చేసిందనే గట్టి నమ్మకంతోనే రివ్యూలు తీసుకున్నాం. కానీ రీప్లేలో విభిన్నంగా కనిపించింది. ఎక్కువ సార్లు సానుకూలమైన ఫలితాలు వస్తాయనే మా అవకాశాలను ఉపయోగించుకుంటాం. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవుతాయి. మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇదంతా ఆటలో భాగమే'అని పంత్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్బంగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ వద్దని వారిస్తున్నా రివ్యూ కోరిన విరాట్ కోహ్లీకి భంగపాటు ఎదురైంది. ఇటీవల కాలంలో రిషభ్ పంత్‌ చాలా వరకూ డీఆర్‌ఎస్‌ కోరడంలో కెప్టెన్ కోహ్లీకి సాయపడుతున్నాడు. కానీ.. లార్డ్స్‌లో పంత్ అభిప్రాయాన్ని పక్కనపెట్టిన కోహ్లీ.. సిరాజ్‌‌పై గుడ్డి నమ్మకంతో డీఆర్‌ఎస్ తీసుకొని మూల్యం చెల్లించుకున్నాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్.. నాలుగో బంతిని లైన్ లెంగ్త్‌తో వికెట్లపైకి విసిరాడు. దాంతో.. ఆ బంతిని డిఫెన్స్ చేసేందుకు జో రూట్ ప్రయత్నించగా.. కొద్దిగా టర్న్ అయిన బంతి బ్యాట్‌కి దొరకకుండా ఫ్యాడ్‌ని తాకుతూ వెళ్లింది. దాంతో.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.

అయితే.. బంతి కచ్చితంగా వికెట్లను తాకేలా కనిపించిందని మహమ్మద్ సిరాజ్ చెప్పడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోవాలని భావించాడు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, సిరాజ్, కోహ్లీ మధ్య చిన్నపాటి డిస్కషన్ కూడా జరిగింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం సిరాజ్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. బంతి లెగ్ స్టంప్‌కు బయటగా వెళ్తోందని కెప్టెన్ విరాట్ కోహ్లీతో వారించాడు. రివ్యూ వద్దని సూచించాడు. కోహ్లీ కూడా తీసుకోవాలా? వద్దా? అని సంశయించాడు. పంత్ నెత్తినోరు కొట్టుకుంటూ చెప్తుండటంతో నవ్వూతూ చివరి క్షణంలో రివ్యూ‌కు సైగా చేశాడు. కానీ.. రిప్లైలో బంతి లెగ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో.. రిషభ్ పంత్ వద్దని బతిమిలాడినా రివ్యూ కోరిన విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే 119/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ జోరూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. బెయిర్ స్టో ఆ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పటికే 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.

Story first published: Saturday, August 14, 2021, 16:55 [IST]
Other articles published on Aug 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+