అందుకే ఆఖరి ఓవర్‌ను స్పిన్నర్‌తో వేయించా: రిషభ్ పంత్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ రొమారియా షెపెర్డ్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఆఖరి ఓవర్‌ను స్పిన్నర్ దిగ్వేష్ రతితో వేయించానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ డీఎల్‌ఎస్ పద్దతిన 9 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నోనే విజయం వరించింది.
గెలిపించిన దిగ్వేష్ రతి..
ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. రిషభ్ పంత్ ఈ ఓవర్‌ను దిగ్వేష్ రతితో వేయించాడు. ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ దిగ్వేష్ రతి షెపెర్డ్‌ను కట్టడి చేశాడు. తొలి మూడు బంతుల్లో 2 పరుగులే ఇచ్చాడు. నాలుగో బంతికి షెపెర్డ్ బౌండరీ బాదినా.. చివరి రెండు బాల్స్ బౌండరీ ఇవ్వకుండా లక్నో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ గెలుపు మాకు ఎంతో ముఖ్యం..
ఈ మ్యాచ్ అనంతరం దిగ్వేష్ రతితో ఆఖరి ఓవర్ వేయించడానికి గల కారణాన్ని వెల్లడించాడు. 'ఇది మాకు ఒక మంచి మ్యాచ్. ఈ విజయం మాకు ఎంతో ముఖ్యం. ఈ టోర్నీలో మేం చాలా ప్రయోగాలు చేశాం. అందరం ఒకేతాటిపైకి రావడం మాకు చాలా ఆనందాన్నిస్తోంది. ఇది ఒక కష్టమైన సీజన్. కానీ కొన్నిసార్లు ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే.
బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించే పర్ఫెక్ట్ గేమ్ కోసం మేం చాలా ప్రయత్నించాం. ఈ ప్రయాణంలో మాకు కొన్నిసార్లు అదృష్టం కలిసొస్తే.. మరికొన్నిసార్లు దురదృష్టం వెంటాడింది. కానీ ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.
అందుకే ఆఖరి ఓవర్ వేయించా..
దిగ్వేష్ రతితో ఆఖరి ఓవర్ వేయించడం కఠినమైన నిర్ణయం. మేం ఒత్తిడిలో ఉన్నాం. కానీ అదే సమయంలో, మన బౌలర్‌ను మనం నమ్మాలి. షెపర్డ్‌కు వ్యతిరేకంగా దిగ్వేష్ రతి సరైన ఎంపిక అని మాకు తెలుసు. అతను తనను తాను నమ్ముకున్నాడు. జట్టు కోసం అనుకున్న పనిని పూర్తి చేశాడు.
మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ అద్భుతం. ఒక జట్టుగా మేం చాలా కష్టపడుతున్నాం. ఈ సీజన్‌లో మా బలం బౌలింగ్. బౌలర్లందరూ తమ శక్తిని ధారపోస్తున్నారు, ముఖ్యంగా ప్రిన్స్, షమీ భాయ్, దిగ్వేష్ రతి, ఆవేష్, మయాంక్.. బౌలర్లందరూ చాలా బాగా బౌలింగ్ చేశారు. బౌలింగ్ యూనిట్‌గా కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. వాటిని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
శతక్కొట్టిన మిచెల్ మార్ష్..
పదే పదే వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను అంపైర్లు 19 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 111) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), రిషభ్ పంత్(10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్‌వుడ్, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్ తలో వికెట్ తీసారు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆర్‌సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు.
అనంతరం ఆర్‌సీబీ నిర్ణీత 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులే చేసి ఓటమిపాలైంది. రజత్ పాటిదార్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 61), దేవదత్ పడిక్కల్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), టీమ్ డేవిడ్(17 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), కృనాల్ పాండ్యా(28 నాటౌట్), రొమారియో షెపెర్డ్(23) రాణించినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(3/33) మూడు వికెట్లు తీయగా.. షెహ్‌బాజ్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీకి ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications