ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. మధ్యాహ్నం గేమ్ పిచ్‌ను వాడుకోవాలి. ప్రస్తుతం మేం మెరుగైన స్థితిలోనే ఉన్నాం. మెరుగైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మయాంక్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ ఇక్కడి వేడి నేపథ్యంలో ముందుగా బ్యాటింగ్ చేయడం కూడా కలిసొచ్చే అంశం. పిచ్ కండిషన్స్‌ను ఎంత త్వరగా అందింపుచ్చుకుంటే అంత మంచిది.

ఈ గేమ్ చాలా ప్రత్యేకమైనది. చిన్న పిల్లల కోసం అంబానీ చేపట్టిన ఈ కార్యక్రమం మాకు స్పూర్దిదాయకం. చిన్నారుల కోసం మేం మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఐపీఎల్ ప్రతీ మ్యాచ్ గెలవడం ముఖ్యమే. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. విజ్ఞేష్ పుతుర్, మిచెల్ సాంట్నర్ స్థానాల్లో కర్ణ్ శర్మ, కొర్బిన్ ఆడుతున్నారు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్: ఎయిడెన్ మార్క్ రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.