For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా నాన్న వల్లే వికెట్‌ కీపర్‌ అయ్యాను: రిషభ్ పంత్

Rishabh Pant Reveals How He Chose Wicket-Keeping

న్యూఢిల్లీ: తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని వికెట్ కీపర్ అయ్యానని టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ అన్నాడు. తన తండ్రి వికెట్ కీపర్ కావడంతో తాను కూడా చిన్నప్పటి నుంచి వికెట్ కీపింగ్ చేయడం మొదలుపెట్టానని తెలిపాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారుసుడిగా జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్.. అతని రిటైర్మెంట్ అనంతరం జట్టులో వికెట్ కీపర్ కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికాతో జూన్ 9 నుంచి సొంతగడ్డపై ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు పంత్‌తో పాటు ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్‌లు కూడా ఎంపికయ్యారు. సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో పంత్.. వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

నాన్నను స్పూర్తిగా తీసుకొని..

నాన్నను స్పూర్తిగా తీసుకొని..

కార్తీక్, ఇషాన్ కిషన్‌లు జట్టులో ఉన్న పంత్ స్థానానికి వచ్చిన ముప్పు ఏం లేదు. అయితే తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన పంత్.. తాను వికెట్ కీపర్ ఎలా అయ్యాననే విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'నేను వికెట్‌ కీపింగ్‌ బాగా చేస్తున్నానో లేదో నాకు తెలియదు. కానీ నేను ఆడే ప్రతీ మ్యాచ్‌లోనే 100 శాతం ఎఫెర్ట్ పెడతాను. నేను ఎప్పుడూ వికెట్ కీపర్-బ్యాటర్‌నే. మా నాన్న కూడా వికెట్‌ కీపర్‌ కావడంతో నేను చిన్నప్పుడు నుంచే వికెట్‌ కీపింగ్‌ చేయడం మొదలు పెట్టాను. మా నాన్నను ఆదర్శంగా తీసుకునే ఈ రోజు నేను వికెట్‌ కీపర్‌ అయ్యాను.' అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

ప్రశాంతంగా ఉంచుకోవాలి..

ప్రశాంతంగా ఉంచుకోవాలి..

ఇక ఏడాది పాటు తీరిక లేని క్రికెట్ ఆడుతుండటం వల్ల మానసికంగా ఒత్తిడి ఉండటం సహజమే అని దానిని ఎదుర్కోవడానికి మనసును నిత్యం ప్రశాంతంగా ఉంచుకుంటానని చెప్పుకొచ్చాడు. 'వికెట్ కీపర్ బ్యాటర్ అంటే మొదటి బంతినుంచి ఇన్నింగ్స్ చివరి బంతి వరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి బంతిని అందుకునే ప్రయత్నం చేయాలి. అయితే మీరు మంచి వికెట్ కీపర్ కావాలంటే మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకోవాలి.అదీగాక ఏడాది పొడవునా క్రికెట్ ఆడుతున్నప్పుడు మీరు మీ మనసును రిఫ్రెస్ చేసుకోవాలి. మనం నిరంతరం ఆడుతుండటం వల్ల ఒత్తిడి సహజం. ఆ సమయంలో మీరు రిఫ్రెస్ అవకుంటే మీరు గ్రౌండ్ లో వంద శాతం ఇవ్వలేరు. క్రికెటర్లు గా మనం మన మనసులపై నిత్యం పని చేస్తూనే ఉండాలి..' అని అన్నాడు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో విఫలం..

ఐపీఎల్ 2022 సీజన్‌లో విఫలం..

ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో 30.91 సగటుతో 340 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. పంత్ వైఫల్యం ఢిల్లీ క్యాపిటల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఢిల్లీ ఓటమి పాలై ఇంటిదారిపట్టింది. కెప్టెన్‌గా పంత్ చేసిన ఘోర తప్పిదం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.

Story first published: Tuesday, June 7, 2022, 12:45 [IST]
Other articles published on Jun 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+