Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కెప్టెన్‌గా రిషభ్ పంత్

ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడి భారత జట్టుకు దూరమైన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ప్రమోషన్ దక్కింది. ప్రస్తుతం పాదం గాయం నుంచి కోలుకుంటున్న పంత్.. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

అయితే ఈ సిరీస్ కంటే ముందే భారత్-ఏ కెప్టెన్‌గా సౌతాఫ్రికా-ఏతో జరిగే రెండు అనధికార టెస్ట్‌లతో పాటు మూడు అనధికార వన్డేలు ఆడనున్నాడు. అనధికార టెస్ట్‌, వన్డేలు ఆడే భారత్-ఏ జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.

ఇంగ్లండ్ పర్యటనలో నాలుగో టెస్ట్ సందర్భంగా రిషభ్ పంత్ పాదానికి తీవ్ర గాయమైంది. అయినా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించిన పంత్.. ఆఖరి టెస్ట్ ఆడకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున రీఎంట్రీ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ పంత్ బరిలోకి దిగలేదు. అక్టోబర్ 30, నవంబర్ 6 నుంచి సౌతాఫ్రికాతో రెండు అనధికార టెస్ట్‌లు ప్రారంభం కానున్నాయి.

Rishabh Pant Returns to Captain India A for Unofficial Test Series

భారత అండర్ 19 కెప్టెన్ ఆయుష్ మాత్రే‌తో పాటు నారయణ జగదీషన్, రజత్ పటీదార్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, శరణ్ జైన్ తొలి అనధికార టెస్ట్‌కు ఎంపికవ్వగా.. , కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ రెండో అనధికార టెస్ట్ ఆడనున్నారు. రిషభ్ పంత్‌తో పాటు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, మానవ్ సుతార్, తనూష్ కొటియాన్ రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అయిన రిషభ్ పంత్.. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

సౌతాఫ్రికా-ఏతో ఆడే భారత్-ఏ జట్లు:

తొలి అనధికార టెస్ట్ కోసం భారత్-ఏ జట్టు:

రిషభ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), ఆయుష్ మత్రే, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్-కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యష్ ఠాకూర్, ఆయుష్ బదోని, సరంశ్ జైన్.

రెండో అనధికార టెస్ట్ కోసం భారత్-ఏ జట్టు:

రిషభ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్-కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.

Story first published: Tuesday, October 21, 2025, 14:38 [IST]
Other articles published on Oct 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+