Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షమీకి మళ్లీ నిరాశే.. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడే భారత జట్టు ఇదే!

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ నిరూపించుకున్నా.. సెలెక్టర్లు పట్టించుకోలేదు. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌లు ఆడిన భారత జట్టులో రెండే మార్పులు జరిగాయి.

ఇంగ్లండ్ పర్యటనలో గాయపడి జట్టుకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీ ఇవ్వగా.. నారయణ్ జగదీషన్‌పై వేటు పడింది. సౌతాఫ్రికా-ఏతో జరిగిన అనధికార టెస్ట్‌ల్లో పంత్ సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున 15 వికెట్లు పడగొట్టినా 35 ఏళ్ల షమీకి సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. తద్వారా సీనియర్లు అవసరం లేదనే సందేశాన్ని ఇచ్చింది.

Rishabh Pant Returns Mohammed Shami Misses Out as BCCI Announces India s Squad for Test Series Against South Africa

ఆకాశ్ దీప్ రీ ఎంట్రీ..

ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ పేసర్ ఆకాశ్ దీప్ సైతం తిరిగి చోటు దక్కించుకోగా.. ప్రసిద్ధ్ కృష్ణపై వేటు పడింది. దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా మరో మొండిచెయ్యే ఎదురైంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ 14 నుంచి కోల్‌కతా వేదికగా జరగనుండగా.. రెండో మ్యాచ్ 22న గువాహటిలో ప్రారంభం కానుంది.

ఈ నెల 13,16,19 తేదీల్లో సౌతాఫ్రికా- ఏతో జరిగే మూడు అనధికార వన్డేలు ఆడే భారత్-ఏ జట్టును కూడా సెలెక్టర్ల ప్రకటించారు. తిలక్ వర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అవకాశం అందుకున్నారు.

బీసీసీఐ ప్రకటించిన జట్లు ఇవే..

భారత టెస్ట్ టీమ్: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్.

భారత్-ఏ జట్టు: తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్.

Story first published: Thursday, November 6, 2025, 10:25 [IST]
Other articles published on Nov 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+