గాయంతో ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పంత్ మైదానంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఏతో గురువారం ప్రారంభమైన తొలి అనధికార టెస్ట్‌తో పంత్ పునరాగమనం చేశాడు.
ఈ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టును నడిపిస్తున్న రిషభ్ పంత్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనలో నాలుగో టెస్ట్ సందర్భంగా రిషభ్ పంత్ పాదానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అయినా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించిన పంత్.. ఆఖరి టెస్ట్ ఆడకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. ఈ గాయం కారణంగా రిషభ్ పంత్.. ఆసియా కప్ 2025 టోర్నీతో పాటు ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న పంత్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున రీఎంట్రీ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ పంత్ బరిలోకి దిగలేదు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌లకు సన్నాహకంగా జరుగుతున్న అనధికార టెస్ట్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.
తొలి అనధికార టెస్ట్‌ను యువ ఆటగాళ్లు ఆడుతున్నా.. రెండో అనధికార మ్యాచ్‌కు సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్-కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్‌లు బరిలోకి దిగనున్నారు. తొలి అనధికార మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా-ఏ నిలకడగా ఆడుతోంది. 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు.