భాగస్వామ్యంలోనూ రికార్డు కొల్లగొట్టిన పంత్-జడేజాలు

సిడ్నీ: ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌లో అదరగొడుతోంది. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న భారత్.. ఆఖరి సిడ్నీ టెస్టులోనూ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 622 పరుగులతో మరో సారి ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. గురువారం మొదలైన ఈ 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సూపర్ సెంచరీలు, రవీంద్ర జడేజా (81), మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.


ఆసీస్ గడ్డపై రికార్డు నెలకొల్పిన పంత్-జడేజా
రెగ్యూలర్‌గా విఫలమవుతోన్న కేఎల్ రాహుల్ మినహాయించి టాప్ ఆర్డర్ నుంచి మిడిలార్డర్ వరకు బ్యాట్స్‌మెన్ అంతా కలిసికట్టుగా రాణించారు. ఈ క్రమంలో ఏడు వికెట్లు కోల్పోయిన అనంతరం 622 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, జడేజా జోడి ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. సిడ్నీ టెస్టులో వీరిద్దరూ కలిసి జట్టులో ఏడో వికెట్‌కు 204 పరుగులు జోడించారు.
ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్ రిషబ్ పంత్(వీడియో)

ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని..
ఆసీస్ గడ్డపై ఏ జట్టుకైనా ఏడో వికెట్‌కు ఇదొక అత్యధిక భాగస్వామ్యం. అంతేకాకుండా భారత్ తరఫున ఏడో వికెట్‌కు ఇది ఆరో అత్యధిక భాగస్వామ్యం. గతంలో భారత్ తరఫున ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని వీవీఎస్ లక్ష్మణ్, అజయ్ రాత్రాలు నమోదు చేశారు. వీరిద్దరూ వెస్టిండీస్‌పై 7వ వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పూజారా
303/4 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించింది టీమిండియా. వ్యక్తిగత స్కోరు 130 వద్ద ఇన్నింగ్స్‌ని కొనసాగించిన పుజారాకు పంత్.. మంచి సహకారాన్ని అందించాడు. ఈ క్రమంలో పూజారా అవుట్ అనంతరం జడేజా బరిలోకి దిగాడు. 134 బంతుల్లో హాఫ్ సెంచరీ.. మరో 65 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి.. 193 పరుగుల వద్ద నాథన్ లయన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వికెట్ చేజార్చుకున్నాడు పూజారా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications