ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్ రిషబ్ పంత్(వీడియో)

సిడ్నీ: ఆసీస్ గడ్డపై నాలుగో టెస్టులో భాగంగా సిడ్నీలో రిషబ్ పంత్ విజృంభించాడు. దూకుడైన ఆటను ప్రదర్శించి వంద పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 137 బంతుల్లో సెంచరీ చేయడం గమనార్హం. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులేస్తుంది. ఈ క్రమంలోనే చతేశ్వర్ పూజారా రెండో రోజు ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. డబుల్ సెంచరీ చేస్తాడనుకుంటున్న క్రమంలో 193 పరుగుల వద్ద అవుటయ్యాడు. అప్పటికీ క్రీజులో ఉన్న పంత్.. జడేజా భాగస్వామ్యంతో రెచ్చిపోయాడు.

తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించిన పంత్
ఇలా భారత వికెట్ కీపర్లలో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సాధించాడు. గతంలో ఫారూఖ్ ఇంజినీర్ 1967వ సంవత్సరంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆస్ట్రేలియా పర్యటన చేశాడు. ఈ పర్యటనలో 89 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన కీపర్‌గా రికార్డులకెక్కాడు.
సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా
ఈ రికార్డు మాత్రమే కాకుండా.. పర్యాటక జట్లలో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలు చేసిన పంత్.. రెండు పర్యటనలలోనూ సెంచరీ దాటేశాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ జెప్ఫెరీ డుజోన్ మాంచెస్టర్ వేదికగా, పెర్త్‌లోనూ 1984వ సంవత్సరంలో సెంచరీలు నమోదు చేశాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్‌పై స్లెడ్జింగ్‌కు దిగి
ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ స్థానంలో బరిలోకి దిగిన రిషబ్ పంత్.. పలుమార్లు ఆసీస్ ప్లేయర్లపై స్లెడ్జింగ్‌కు దిగాడు. ఏకంగా ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌ను 'కేవలం మాటలు మాత్రమే చెప్తాడు ఇంకేం చేయాలో తెలియదు' అంటూ కవ్వింపులకు దిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications