Rishabh Pant: పంత్ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ..! పేలుతున్న మీమ్స్!

పార్ల్: సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక రెండో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ దుమ్మురేపాడు. తన సహజశైలిలో ధనాధన్ బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 46 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్‌తో కలిసి మూడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫస్ట్ వన్డేలో సౌతాఫ్రికా సూపర్ ప్లాన్‌కు స్టంపౌటైన పంత్.. తాజా మ్యాచ్‌లో దానికి బదులు తీర్చుకుంటున్నాడు.
ధనాధన్ బ్యాటింగ్..
64 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రిషభ్ పంత్.. రాహుల్‌తో కలిసి ఆదుకున్నాడు. ఆరంభంలో కొంత తడబడినా.. ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగాడు. మహరాజ్ బౌలింగ్‌లో సిక్స్‌తో హిట్టింగ్ షురూ చేసిన పంత్.. షంసీ బౌలింగ్‌లో మూడు బౌండరీలతో చెలరేగాడు. అదే జోరులో పెహ్లుక్వాయో బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన పంత్.. షంసీ బౌలింగ్‌లో సింగిల్ హ్యాండ్‌తో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదాడు. ఇది ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది.
పంత్ అంటే ఫైరూ..
ఇక పంత్ సూపర్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పుష్ప సినిమా డైలాగ్‌తో పంత్‌ను కొనియాడుతున్నారు. 'పంత్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ'అని ట్వీట్ చేస్తున్నారు. పంత్ 50 ఓవర్లపాటు ఆడితే డబుల్ సెంచరీ చేస్తాడని ఒకరంటే.. సెంచరీతో కెరీర్ బెస్ట్ వన్డే స్కోర్ సాధిస్తాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. నిర్లక్ష్యపు ఆట అంటూ పదేపదే విమర్శించే క్రికెట్ఎక్స్‌పర్ట్స్‌కు అదే తరహా ఆటతో దిమ్మతిరిగే బదులిచ్చాడు.
వరుసగా రెండు వికెట్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్(42 బ్యాటింగ్), శిఖర్ ధావన్(29) శుభారంభాన్ని అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసి పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ పవర్ ప్లే ముగిసిన వెంటనే టీమిండియా కథ మారింది. మార్కరమ్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించిన శిఖర్ ధావన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఐదు బంతుల్లోనే ఔటయ్యాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో తడబడ్డ విరాట్.. అతను వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కవర్ డ్రైవ్‌కు ప్రయత్నించగా.. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న బవుమా సునాయసంగా క్యాచ్ పట్టాడు. దాంతో విరాట్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
మూడు లైఫ్స్ వచ్చినా..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన పంత్‌తో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే పంత్ ధాటిగా ఆడుతుండటంతో రాహుల్ యాంకర్ రోల్ పోషించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పంత్ కారణంగా రనౌటవ్వాల్సిన రాహుల్.. సౌతాఫ్రికా ఫీల్డర్ల తప్పిదంతో బచాయించారు. ఆ తర్వాత మార్కరమ్ సునాయస క్యాచ్ నేలపాలు చేశాడు. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలో కూడా క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మూడు లైఫ్స్ వచ్చినా రాహుల్ హాఫ్ సెంచరీకే పరిమితమయ్యాడు. మగలా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications