Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: పాపం రిషభ్ పంత్.. బ్యాట్‌తో పాటు వికెట్ చేజారింది!(వీడియో)

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ దుమ్మురేపుతున్నాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన పంత్.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. 58 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

అయితే పంత్ విచిత్రకర రీతిలో ఔటవ్వడం చర్చనీయాంశమైంది. భారీ షాట్ ఆడే క్రమంలో రిషభ్ పంత్ చేతిలో నుంచి బ్యాట్ చేజారగా.. గాల్లోకి లేచిన బంతిని బెన్ డకెట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పంత్ ఔటైన తీరుపై ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'పాపం రిషభ్ పంత్.. బ్యాట్‌తో పాటు వికెట్ చేజారింది'అని కామెంట్ చేస్తున్నారు. షోయబ్ బషీర్ వేసిన 47వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని పంత్.. క్రీజు ధాటి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతని చేతిలో నుంచి జారిన బ్యాట్ గాల్లోకి లేచి మిడ్ వికెట్‌లో పడగా.. బంతిని డకెట్ అందుకున్నాడు. దాంతో పంత్ ఎంటర్‌టైన్‌మెంట్ ముగిసింది.

Rishabh Pant Loses Bat and Wicket in Same Delivery During IND vs ENG 2nd Test

ఈ ఇన్నింగ్స్‌లో పంత్ క్రీజులో ఉన్నంతసేపు అలరించాడు. కేఎల్ రాహుల్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. వచ్చి రావడంతోనే భారీ షాట్స్ ఆడాడు. లంచ్ బ్రేక్‌ ముందు కూడా అతని చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. అది చూసి ఆటగాళ్లంతా నవ్వుకున్నారు.

బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిషభ్ పంత్‌ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను జాక్ క్రాలీ నేలపాలు చేశాడు. జోష్ టంగ్‌ బౌలింగ్‌లో 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను క్రిస్ వోక్స్ అందుకోలేకపోయాడు. ఈ రెండు అవకాశాలతో పంత్ చెలరేగాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శుభ్‌‌మన్ గిల్ కూడా 57 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే భారత్ ఆధిక్యం 461 పరుగులు ధాటింది.

సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ 587 ఆలౌట్ (శుభ్‌మన్ గిల్ 269; షోయబ్ బషీర్ 3/167)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆలౌట్ (జెమీ స్మిత్ 184 నాటౌట్, సిరాజ్ 6/70)

Story first published: Saturday, July 5, 2025, 19:48 [IST]
Other articles published on Jul 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+