For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఒక్క మ్యాచ్ ఓడినా ఫ్లే‌ఆఫ్స్ నుంచి ఔట్, దృష్టంతా ఐపీఎల్‌పైనే'

By Nageshwara Rao
Rishabh Pant lauds Prithvi Shaw after Delhi Daredevils’ win over Rajasthan Royals

హైదరాబాద్: టీమిండియాలో చోటు కోసం తాను ఆలోచించడం లేదని, ప్రస్తుతం తన దృష్టంతా ఐపీఎల్‌పైనే ఉందని ఢిల్లీ డేర్‌డెవిల్స్ యువ క్రికెటర్ రిషబ్ పంత్ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం రిషబ్‌ పంత్‌ మాట్లాడుతూ 'టీమిండియాలో చోటు గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నా. నా దృష్టంతా ఐపీఎల్‌పైనే ఉంది' అని అన్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

'ఈ మ్యాచ్‌ విజయం మాకెంతో అవసరం. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎదుర్కొనేందుకు నేను కొన్ని ప్రణాళికలు వేసుకున్నా. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఎలా అయినా గెలుస్తాం అన్న పాజిటివ్‌ ఆలోచనతోనే ఉన్నాం. టోర్నీలో ఇక ఒక మ్యాచ్‌ ఓడినా మేము ప్లేఆఫ్స్‌ రేసులో ఉండబోమని తెలుసు. ఇదే వ్యూహంతో ప్రతి మ్యాచ్‌ ఆడతాం' అని తెలిపాడు.

ఇప్పటికే ఐపీఎల్ 11వ సీజన్ సగం పూర్తి అయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉన్న ప్రతి జట్టూ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై, ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని బెంగళూరు, ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో చోటు కోసం బాగా కష్టపడాలి.

ఇక, ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ 'ఈ విజయం మా జట్టుకు ఎంతో ముఖ్యమైనది. ఈ పిచ్‌పై 200 పరుగులు చేసినా తక్కువ స్కోరు కిందే లెక్క. ఎందుకంటే ఈ మైదానం చిన్నది. బౌలర్లకు బౌలింగ్‌ చేయడం కష్టం. అలాగే ఒకసారి బ్యాట్స్‌మెన్‌ హిట్టింగ్‌ మొదలు పెడితే ఒక ఆపడం కష్టం' అని అన్నాడు.

'ఈ మ్యాచ్‌లో నేను ఒక క్యాచ్‌ వదిలేశానే. అదృష్టవశాత్తూ మ్యాచ్‌ గెలిచాం. పృథ్వీ షా మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అలాగే రిషబ్ పంత్‌ మిడిలార్డర్‌లో చక్కటి ప్రదర్శన చేశాడు. రాబోయే రోజుల్లో జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా ఇలాంటి ప్రదర్శనలే చేయాలని ఆశిస్తున్నా' అని అన్నాడు.

Story first published: Thursday, May 3, 2018, 16:29 [IST]
Other articles published on May 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+