For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రిషభ్ పంత్

Rishabh Pant Hails Hardik Pandya and Dinesh Karthik After India Beat South Africa in 4th T20I

రాజ్‌కోట్: హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌ల అద్భుత బ్యాటింగ్‌తోనే సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో విజయం సాధించామని టీమిండియా తాత్కలిక సారథి రిషభ్ పంత్ అన్నాడు. కీలక సమయంలో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 82 పరుగులు తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. ఇరు జట్ల మధ్య ఆదివారం బెంగళూరు వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన పంత్.. హార్దిక్, కార్తీక్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు.

హార్దిక్ సూపర్ బ్యాటింగ్‌తో..

హార్దిక్ సూపర్ బ్యాటింగ్‌తో..

'ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేయడం, అద్భుతమైన ప్రదర్శన కనబర్చడంపైనే మేం తరుచూ మాట్లాడుకున్నాం. అనుకున్న విధంగానే ప్రణాళికలను అమలు చేయడంతో మాకు ఈ ఫలితం దక్కింది. సాధారణంగా ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టుకు విజయం దక్కుతుంది. వచ్చే మ్యాచ్‌లోనైనా నాకు టాస్ కలిసొస్తుందనుకుంటున్నా. సానుకూలంగా ఉండటం ముఖ్యం. కీలక సమయంలో హార్దిక్ పాండ్యా నిలబడటం సంతోషించే విషయం.

 100 శాతం ఎఫర్ట్ పెడతాం..

100 శాతం ఎఫర్ట్ పెడతాం..

దినేశ్ కార్తీక్ అయితే తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని చంపేసాడు. వ్యక్తిగతంగా నేను కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. అయితే దానిగురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సానుకూలంశాలను తీసుకొని ముందుకు సాగుతూ మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తా. బెంగళూరులో ఏం జరుగుతుందో చూడాలి. 100 శాతం మా ఎఫర్ట్ పెడుతాం'అని పంత్ చెప్పుకొచ్చాడు.

56 పరుగులకే 3 వికెట్లు..

56 పరుగులకే 3 వికెట్లు..

పంత్ మళ్లీ టాస్ ఓడటంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. 10 ఓవర్లలో 3 వికెట్లకు 56 పరుగులే చేసింది. ఈ మ్యాచ్‌లో జట్టు కనీసం 120 పరుగులైనా చేస్తుందా? ఇక సిరీస్‌ పోయినట్టేనా? అనే సందేహం కలిగింది. కానీ దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య తమ విధ్వంసంతో జట్టుకు ఊహించని మొత్తాన్ని అందించారు. వాళ్ల బాదుడుతో చివరి అయిదు ఓవర్లలో జట్టు 73 పరుగులు రాబట్టింది. అనంతరం అవేశ్‌ఖాన్‌ బౌన్సర్లతో

చెలరేగడం.. మిగతా బౌలర్లూ సమష్టిగా రాణించడంతో భారత్ విజయాన్నందుకుంది.

 కార్తీక్ ఫస్ట్ ఫిఫ్టీ..

కార్తీక్ ఫస్ట్ ఫిఫ్టీ..

మొదట టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దినేశ్‌ కార్తీక్‌ ( 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధశతకాన్ని అందుకున్నాడు. హార్దిక్‌ పాండ్య ( 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) బాదుడు కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఎంగిడి (2/20) రాణించాడు. ఈ మ్యాచ్‌తో జాన్సన్‌ (1/38) అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. అవేశ్‌ ఖాన్‌ (4/18) ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. చాహల్‌ (2/21) కూడా మెరిశాడు.

Story first published: Saturday, June 18, 2022, 8:07 [IST]
Other articles published on Jun 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+