మైండ్ పనిచేయక..
ఇక అనవసరంగా ఔటయ్యాననే బాధలో ఉన్న పంత్‌కు మైండ్ కూడా దొబ్బింది. దాంతో అతను తన డ్రెస్సింగ్ రూమ్‌ను కూడా మరిచిపోయాడు. ఔటైన వెంటనే నేరుగా సౌతాఫ్రికా డ్రెస్సింగ్ రూమ్‌వైపు నడిచాడు. చివరకు తన తప్పిదం తెలుసుకొని నెత్తిని బాదుకుంటూ భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. చెత్త షాట్‌తో అనవసరంగా ఔటయ్యాననే ఫీలింగ్..అతని మైండ్‌ను పనిచేయకుండా చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
నిర్లక్ష్యపు షాట్‌తో..
ఇక రబడా వేసిన 39వ ఓవర్‌లో స్టెప్ ఔటై భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. భారీ షాట్ ఆడే ఆతృతలో బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దాంతో పంత్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా కీపర్ చేతిలో పడింది. అయితే క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మన్ వెనువెంటనే ఔటైన తర్వాత.. క్రీజులోకి వచ్చిన పంత్ బాధ్యతాయుతంగా ఆడకుండా నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్ చేరడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ సైతం పంత్ నిర్లక్ష్యపు షాట్‌పై అసహనం వ్యక్తం చేశాడు. పంత్ ఆడిన షాట్ ఏమాత్రం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది అతని సహజ ఆటతీరు కాదని, బంతి బౌన్స్ అవుతున్నప్పుడు ఓపికగా ఉండాల్సిందన్నాడు.

13 ఇన్నింగ్స్‌లో ఒకటే 50
ఇక రిషభ్ పంత్ దారుణ వైఫల్యంపై అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం 13 ఇన్నింగ్స్‌లు ఆడిన రిషభ్ పంత్ ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ( 4, 41, 25, 37, 22, 2, 1, 9, 50, 8, 34,17,0) ఇందులో 6 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లే ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్ 59 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చతేశ్వర్ పుజారా, రహానే వైఫల్యంతో పంత్ చెత్తాటను ఎవరూ పెద్దగా గుర్తించలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రిషభ్ పంత్‌ను సైతం పక్కనపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్ చేస్తున్నారు.

సౌతాఫ్రికా లక్ష్యం 240
85/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. 60.1 ఓవర్లలో 266 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 27 పరుగుల లోటు తీసేయగా సౌతాఫ్రికా ముందు 240 పరుగుల పోరాడే లక్ష్యం నమోదైంది. భారత ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా(86 బంతుల్లో 10 ఫోర్లతో 53), అజింక్యా రహానే(78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. తెలుగు క్రికెటర్ హనుమ విహారి(84 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) అజేయంగా నిలిచాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్(24 బంతుల్లో 5 ఫోర్లతో 28) విలువైన పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 47 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(31) శార్దూల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.


Click it and Unblock the Notifications












