Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Urvashi Rautela: రిషభ్ పంత్‌ను వదలని బాలీవుడ్ బ్యూటీ.. ఆస్ట్రేలియాకు వెళ్లిన రౌటేలా!

Rishabh Pant fans trolls Urvashi Rautela after she arrives in Australia

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా నీడలా వెంటాడుతుంది. తాజాగా టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా వెళ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. ఊర్వశీ రౌటేలా సైతం ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

ఆమె దేని కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుందో తెలియదు కానీ.. రౌటెలా షేర్ చేసిన పోస్ట్ మాత్రం పంత్ కోసమేననే విషయం అర్థమవుతుంది. నా లవ్‌ను అనుసరిస్తున్నాను.. ఆస్ట్రేలియాకు వెళ్తున్నా'అని ఫ్లైట్‌లోని ఫొటోను షేర్ చేసింది. దాంతో పంత్ కోసమే ఊర్వశీ రౌటేలా ఆస్ట్రేలియాకు వెళ్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తనతో సెక్స్ చేయడానికి..

రిషభ్ పంత్ తనతో సెక్స్ చేయడానికి తెగ ఆరాటపడ్డాడని సంచలన ఆరోపణలు చేసిన ఊర్వశీ రౌటేటా.. ఆసియా కప్ ముందు సోషల్ మీడియా వేదికగా అతనితో వాగ్వాదానికి దిగింది. రిషభ్ పంత్ పేరును ప్రస్తావించకుండా తన కోసం హోటల్ గదిలో వేచి చూసాడని ఓ ఇంటర్వ్యూలో రౌటేలా చెప్పగా.. పాపులారిటీ కోసం ఇంత దిగుజారుతారా? అంటూ భారత వికెట్ కీపర్ కౌంటరిచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఊర్వశీ బ్యాట్ బాల్ ఆడుకోవాలని, నకరాలు చేస్తే ఇజ్జత్ తీస్తానని హెచ్చరించింది.

పిల్ల బచ్చా అంటూ..

'అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చాల వల్ల బద్నాం అవ్వడానికి. ఆర్‌పీ చోటు భయ్యా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే పురుషుడు). నీ ఇజ్జత్ తీస్తా'అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనికి ఆర్‌పీ చోటు భయ్యా, కౌగర్ హంటర్, డోంట్‌ టేక్‌ అడ్వాంటేజ్‌ ఆఫ్‌ ఏ సైలెంట్‌ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది. దీనికి పంత్ సైతం తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. మన ఆధీనంలో లేని విషయాలను ఏ మాత్రం పట్టించుకోవద్దని బదులిచ్చాడు.

పంత్ భయ్యాను దీదీ వదలడం లేదుగా..

ఊర్వశి ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లింది పంత్ కోసమేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. భయ్యాను దీదీ వదలడం లేదంటూ ఓ నెటిజన్ స్పందిస్తే... పంత్ ఏకాగ్రతను చెదరగొట్టడానికే ఆమె ఆసీస్ కూడా వెళ్తుందా..? అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. పబ్లిసిటీ కోసమే ఊర్వశి పంత్ వెనుక పడుతోందంటూ ట్రోల్ చేస్తున్నారు.

Story first published: Sunday, October 9, 2022, 16:02 [IST]
Other articles published on Oct 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+