Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: అందుకే ఆ ఇద్దరిపై వేటు: రిషభ్ పంత్

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారీ స్కోర్ నమోదు చేసేందుకు ప్రయత్నిస్తామన్నాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మేం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నాం. పిచ్ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలనుకుంటున్నాం. పిచ్‌పై ఎలాంటి పగుళ్లు లేవు. ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ చారిత్రాత్మక సిరీస్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. ముత్తుసామీ జట్టులోకి వచ్చాడు.'అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.

మరోవైపు మెడ నొప్పితో శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌ టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. కెప్టెన్ మారినా టీమిండియాకు కలిసిరాలేదు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ టాస్ ఓడింది. టాస్ ఓడినా పెద్ద సమస్య ఏం లేదని రిషభ్ పంత్ తెలిపాడు. భారత టెస్ట్ టీమ్‌కు సారథ్యం వహించడం గర్వించదగిన విషయమని సంతోషం వ్యక్తం చేశాడు.

Rishabh Pant Explains Why Shubman Gill and Axar Patel Missed the IND vs SA 2nd Test

'ఇది కచ్చితంగా గర్వించదగ్గ క్షణం. కెప్టెన్సీ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. కానీ ఈ అవకాశాన్ని రెండు చేతులతో అందుకోవాలనుకుంటున్నాను. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. అయితే ముందుగా బౌలింగ్ చేయడం కూడా మంచి ఆప్షన్. శుభ్‌మన్ గిల్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అతను మ్యాచ్ ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కానీ అతని శరీరం సహకరించలేదు.

అతను బలంగా తిరిగి వస్తాడు. భారత జట్టులో రెండు మార్పులు చేశాం. శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్ స్థానంలో సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వచ్చారు. పిచ్ కండిషన్స్‌, టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ మార్పులు చేశాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచిన భారత్‌కు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ సమమవుతుంది. లేదంటే సౌతాఫ్రికా వశమవుతుంది.

తుది జట్లు:

సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్‌రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సిమోన్ హార్మర్, మార్కో జాన్సెన్, సెనరన్ ముత్తుసామీ, కేశవ్ మహారాజ్

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

Story first published: Saturday, November 22, 2025, 8:51 [IST]
Other articles published on Nov 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+