Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు!

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్‌ను సమం చేశాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్‌ను రిషభ్ పంత్ అధిగమించాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్( 75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఒంటి కాలితో రికార్డ్

ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడినా.. కుడి కాలి చివరి వేలుకి ఫ్రాక్చర్ అయినా జట్టు కోసం నొప్పిని భరిస్తూనే ఒంటి కాలితో బ్యాటింగ్ చేశాడు. ఒంటి కాలితో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. మొత్తం ఈ ఇన్నింగ్స్‌లో రెండు సిక్స్‌లు బాదిన పంత్.. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 90 సిక్స్‌లు కొట్టాడు. తద్వారా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్‌ను సమం చేశాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Rishabh Pant Equals Virender Sehwag s All-Time Indian Record for Most Test Sixes Surpassing Rohit Sharma

వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్ట్‌ల్లో 90 సిక్స్‌లు బాదగా.. రిషభ్ పంత్ 47 మ్యాచ్‌ల్లో 90 సిక్స్‌లు కొట్టాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మను రిషభ్ పంత్‌ అధిగమించాడు. రోహిత్ శర్మ 67 టెస్ట్‌ల్లో 88 సిక్స్‌లు కొట్టాడు. ధోనీ 90 మ్యాచ్‌ల్లో 78 సిక్స్‌లు బాదగా.. రవీంద్ర జడేజా 84 టెస్ట్‌ల్లో 74 సిక్స్‌‌లు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ 200 టెస్ట్‌ల్లో 69 సిక్స్‌లు బాదగా.. కపిల్ దేవ్ 131 టెస్ట్‌ల్లో 61 సిక్స్‌లు కొట్టాడు.

క్ర.సంఖ్య ఆటగాడి పేరు ఆడిన మ్యాచ్‌లు సిక్స్‌లు
1. రిషభ్ పంత్ 47* 90*
2. వీరేంద్ర సెహ్వాగ్ 103 90
3. రోహిత్ శర్మ 67 88
4. మహేంద్ర సింగ్ ధోనీ 90 78
5. రవీంద్ర జడేజా 83* 74*
6. సచిన్ టెండూల్కర్ 200 69
7. కపిల్ దేవ్ 131 61
8. సౌరవ్ గంగూలీ 113 57
9. శుభ్‌మన్ గిల్ 29* 43*
10. హర్భజన్ సింగ్ 103 42

భారత్ 358 ఆలౌట్

264/4 ఓవర్‌‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. కేఎల్ రాహుల్(98 బంతుల్లో 4 ఫోర్లతో 46) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు.

Story first published: Thursday, July 24, 2025, 19:32 [IST]
Other articles published on Jul 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+