పంత్‌పై వేటు.. అఫ్గాన్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లకు భారత జట్టు ప్రకటన!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. జూన్ 6 నుంచి అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లకు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని వేర్వేరు జట్లను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్ల వివరాలను చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మంగళవారం వెల్లడించాడు.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ రెండు సిరీస్‌ల నుంచి సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా.. మహమ్మద్ సిరాజ్‌ను ఏకైక టెస్ట్‌కు పరిమితం చేశారు. మరోసారి మహమ్మద్ షమీని సెలెక్టర్లు పట్టించుకోలేదు. అతని గురించి సెలక్షన్ కమిటీ చర్చించలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.

అనామక ఆటగాళ్లు అయిన హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, మానవ్ సుతార్ తొలిసారిగా భారత జట్టు పిలుపును అందుకున్నారు. ప్రిన్స్ యాదవ్ వన్డే సిరీస్‌కు ఎంపికవ్వగా.. గుర్నూర్ బ్రార్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్‌దూబేలకు వన్డేతో పాటు టెస్ట్ టీమ్‌లో చోటు దక్కింది.
రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వగా.. అక్షర్ పటేల్, ఆకాశ్ దీప్‌లను ఎంపిక చేయలేదు. టెస్ట్ టీమ్‌లో చోటు నిలబెట్టుకున్న రిషభ్ పంత్.. వన్డే టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. టెస్ట్ వైస్ కెప్టెన్సీని కేఎల్ రాహుల్‌కు కోల్పోయాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వన్డే జట్టులోకి వచ్చారు. అయితే రోహిత్, హార్దిక్ ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆడుతారని సెలెక్టర్లు స్పష్టం చేశారు.
అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు భారత జట్టు: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్‌దూబే
అఫ్గాన్‌తో వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications