Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్!

టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 100 సిక్స్‌ల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా సుదీర్ఘ ఫార్మాట్‌లో 100 సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా కూడా చరిత్రకెక్కాడు.

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో లాహిరు కుమార బౌలింగ్‌లో సిక్స్ బాది ఈ ఫీట్ సాధించాడు. ఇదే సిక్సర్‌తో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 89 ఇన్నింగ్స్‌ల్లోనే రిషభ్ పంత్ ఈ ఘనతను అందుకోవడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా రిషభ్ పంత్ నిలిచాడు.

టెస్ట్‌ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్లు

బెన్ స్టోక్స్-138 సిక్స్‌లు

బ్రెండన్ మెక్‌కల్లమ్-107 సిక్స్‌లు

రిషభ్ పంత్-100 సిక్స్‌లు

ఆడమ్ గిల్‌క్రిస్ట్-100 సిక్స్‌లు

టీమ్ సౌథి-98 సిక్స్‌లు

Rishabh Pant Makes History as Fastest Batter to Reach 100 Test Sixes Joins Elite Club During IND vs SL 1st Test

టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 100 సిక్స్‌లు బాదిన బ్యాటర్లు(ఇన్నింగ్స్ పరంగా)

రిషభ్ పంత్-89 ఇన్నింగ్స్‌లు

ఆడమ్ గిల్‌క్రిస్ట్-130 ఇన్నింగ్స్‌లు

బెన్ స్టోక్స్-151 ఇన్నింగ్స్‌లు

బ్రెండన్ మెక్‌కల్లమ్ -170 ఇన్నింగ్స్‌లు

టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 100 సిక్స్‌లు బాదిన బ్యాటర్లు(అతి తక్కువ బంతులపరంగా)

రిషభ్ పంత్- 4918

ఆడమ్ గిల్‌క్రిస్ట్-6578

బెన్ స్టోక్స్- 9042

బ్రెండన్ మెక్‌కల్లమ్-9756

శ్రీలంక ముందు భారీ లక్ష్యం..

రిషభ్ పంత్(69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రెండో ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్‌తో పాటు దేవదత్ పడిక్కల్(75 బంతుల్లో 6 ఫోర్లతో 44) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/31) నాలుగు వికెట్లు తీయగా.. ప్రబాత్ జయసూర్య(3/43) మూడు వికెట్లు పడగొట్టాడు. కేశర నువాంత ఒక వికెట్ తీయగా.. లాహిరు కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.

అయితే ఈ భారీ లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. సిరాజ్, మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ నిప్పులు చెరగడంతో శ్రీలంక 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో రోజు ఆటలో ఇంకా 25 ఓవర్లకు పైగా ఆట మిగిలి ఉంది. పిచ్ బౌలింగ్‌కు అడ్వాంటేజ్‌గా మారింది. ఆట సాఫీగా సాగితే భారత్ విజయం ఈ రోజే లాంఛనమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌‌లో శ్రీలంకను రక్షించేది వరణుడు మాత్రమే. వరణుడు ఆటకు అంతరాయం కలిగిస్తే.. శ్రీలంక డ్రాతో గట్టెక్కుతుంది. లేదంటే విజయం భారత్ వశమవుతోంది.

Story first published: Tuesday, August 18, 2026, 16:32 [IST]
Other articles published on Aug 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+