Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rishabh Pant: బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా‌తో రిలేషన్‌కు పంత్ గుడ్‌బై!

 Rishabh Pant Blocking Urvashi Rautela On WhatsApp

న్యూఢిల్లీ: బాలీవుడ్, క్రికెట్‌ మధ్య వీడదీయని బంధం ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శర్మ, గీతా బస్రా, సాగరిక, షర్మిలా టాగూర్ తన లైఫ్ పార్టనర్స్‌గా క్రికెటర్లనే ఎంచుకున్నారు. అప్పటి పటౌడీ నుంచి బాలీవుడ్-క్రికెట్ ప్రేమయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాతో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే తమ రిలేషన్ గురించి ఈ ఇద్దరు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. బాహటంగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.

 డిన్నర్ డేటింగ్‌లతో..

డిన్నర్ డేటింగ్‌లతో..

రెండేళ్ల క్రితం భారత్‌-వెస్టిండీస్‌ టీ20 సిరీస్ సందర్భంగా పంత్‌, ఊర్వశి కలిసి ముంబైలోని ఓ ఖరీదైన హోటల్‌లో డిన్నర్‌ చేస్తూ కనిపించారు. దీంతో ఈ జోడీ డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వార్తలు నిజమేనని అభిమానులు కూడా నమ్మారు. టీమిండియా మ్యాచ్‌లకు ఊర్వశి హాజరవ్వడం.. రిషభ్ పంత్‌ను ఉత్సాహపరుస్తూ గ్యాలరీలో సందడి కూడా చేయడంతో ఈ ప్రచారంపై మరింత క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 4న పంత్ జన్మదినాన్ని జరుపుకోగా.. రౌతేలా బర్త్ డే విషెస్ తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య ఇంకా ఏదో నడుస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ -పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఊర్వశి రౌతేలా హాజరైంది. జాతీయ జెండాను ఊపుతూ పంత్‌ను ఎంకరేజ్ చేసింది.

రిలేషన్‌షిప్‌కు బ్రేకప్..

రిలేషన్‌షిప్‌కు బ్రేకప్..

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరు తమ రిలేషన్‌కు స్వస్తీ చెప్పినట్లు తెలుస్తోంది. తమ వాట్సాప్‌లో ఒకరికొకరు బ్లాక్ కూడా చేసుకున్నారంట. పరస్పర అంగీకారంతో ఈ ఇద్దరూ తమ వాట్సాప్ నెంబర్లను బ్లాక్ చేసుకున్నారని, ఊర్వశి రిషభ్ పంత్‌కు టచ్‌లో ఉండేందుకు ఎంత ప్రయత్నించినా అతను స్పందించడం లేదని ఆమె అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఊర్వశితో రిలేషన్ మెయింటేన్ చేయడం పంత్ ఇష్టం లేదని తెలిపాడు. ఆటపై ఫోకస్ పెట్టేందుకే రౌతేలాకు పంత్ బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇషా నేగితో పంత్ రిలేషన్..

ఇషా నేగితో పంత్ రిలేషన్..

అయితే 2019లోనే రిషభ్ పంత్ డెహ్రాడూన్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ ఇషా నేగితో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించాడు. ఆమెను తొడలపై కూర్చోబెట్టుకొని దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు.'నీవు ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చూస్తా. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం'అనే క్యాప్షన్ పేర్కొన్నాడు. ఇదే ఫొటోను ఇషా నేగి కూడా షేర్ చేసింది. ఐపీఎల్ 2021 సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషభ్ పంత్ యూఏఈ వెళ్లగా.. ఇషా నేగి కూడా యూఏఈ పర్యటనకు వెళ్లింది.

సౌతాఫ్రికా పర్యటనలో..

సౌతాఫ్రికా పర్యటనలో..

ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక వికెట్ కీపర్‌గా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టి వికెట్ కీపర్‌గా 100 డిసిమిసల్స్ మైలు రాయి అందుకున్నాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న వికెట్ కీపర్‌గా నిలిచి.. ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 113 పరుగుల భారీ తేడాతో గెలుపొంది మూడు టెస్ట్‌ల సిరీస్‌లో శుభారంభం చేసింది.

Story first published: Thursday, December 30, 2021, 19:30 [IST]
Other articles published on Dec 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+