Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Ranikings: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 800 రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకున్న తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ భారత వికెట్ కీపర్.. 800 రేటింగ్ పాయింట్స్ అందుకోలేదు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో రిషభ్ పంత్.. వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు జింబాబ్వే వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు.

తాజా ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రిషభ్ పంత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ బుధవారం ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో పంత్ 801 రేటింగ్ పాయింట్స్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. ఐసీసీ బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో జోరూట్(889 రేటింగ్ పాయింట్స్) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హ్యారీ బ్రూక్(874), కేన్ విలియమ్సన్(867) టాప్-3లో ఉన్నారు.

Rishabh Pant Becomes First Indian Wicketkeeper to Reach 800 ICC Test Rating Points

యశస్వి జైస్వాల్(851)తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్-10లో యశస్వి జైస్వాల్‌తో పాటు రిషభ్ పంత్ మాత్రమే ఉన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీ నమోదు చేసిన కేఎల్ రాహుల్ 10 స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 5 స్థానాలు ఎగబాకి 20వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఐదు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు.

టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా 907 రేటింగ్ పాయింట్స్‌తో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి టెస్ట్‌లో విఫలమైన రవీంద్ర జడేజా 3 స్థానాలు దిగజారి టాప్-10లో చోటు కోల్పోయాడు. టాప్-10 బౌలర్లలో బుమ్రా మాత్రమే ఉన్నాడు.

Story first published: Wednesday, June 25, 2025, 17:49 [IST]
Other articles published on Jun 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+