అసలేం జరిగిందంటే..
యుజ్వేంద్ర చాహల్ వేసిన 32వ ఓవర్ మూడో బంతిని డస్సెన్ స్వీప్ షాట్ ఆడాడు. అయితే మిడ్ వికెట్ దిశగా ఫీల్డింగ్‌లో ఉన్న శిఖర్ ధావన్ సూపర్ డైవ్‌తో బంతిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బౌండరీకి తాకిందా? లేదా? అనే విషయంపై స్పష్టత కరువైంది. దాంతో థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించాడు. బంతి శిఖర్ ధావన్‌తో టచ్‌లో ఉండగా అతను బౌండరీని తాకినట్లు అనిపించింది. కానీ క్లారిటీ లేదు. సరైన ఆధారల్లేవని భావించిన థర్డ్ అంపైర్.. శిఖర్ ధావన్ ప్రయత్నానికి విలువ ఇస్తూ బెన్‌ఫిట్ ఆఫ్ ఫీల్డర్ కింద బౌండరీ ఇవ్వలేదు.

పంత్ సెటైర్స్..
ఇక ఈ రిప్లేలను పరిశీలిస్తున్న సమయంలో రిషభ్ పంత్ తన నోటికి పనిచెప్పాడు. ‘శభాష్.. గబ్బర్! కెమెరాలకు చిక్కకుండా ఫీల్డింగ్ చేశావ్! సూపర్. దొంగపని చేసినా దొరక్కుండా చేయాలి'అంటూ సెటైర్లు పేల్చాడు. ఇక పంత్ కామెంట్స్‌కు కామెంటేటర్లు కూడా ఫిదా అయ్యారు. అతను అన్న మాటలను మరోసారి రిపీట్ చేశారు. ఇక పంత్ వ్యాఖ్యానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతనికి ఓ మైక్ ఇవ్వాలని.. కీపింగ్ చేస్తూనే కామెంట్రీ చెప్తాడని కామెంట్ చేస్తున్నారు.

చెలరేగుతున్న బవుమా, డస్సెన్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా నిలకడగా ఆడుతుంది. 37 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా( 81 బ్యాటింగ్) సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా.. డస్సెన్(61 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు ఓపెనర్ జెనెమన్ మలన్(6)ను బుమ్రా ఆరంభంలోనే కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(27)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. ఎయిడెన్ మార్క్‌రమ్(4)ను వెంకటేశ్ అయ్యర్ ఓ రనౌట్ చేశాడు.


Click it and Unblock the Notifications
