For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rahul vs Pant: బంతిని చూసి ఆడరా.. గుడ్డిగా ఊపడం లేదు బ్రో! (వీడియో)

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిచ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారడంతో పంత్‌ దూకుడుగా ఆడకుండా రాహుల్ అడ్డుకున్నాడు. పదే పదే ఓపికగా ఆడాలని చెప్పాడు.

ఈ క్రమంలో వీరి సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది. భారీ షాట్‌కు ప్రయత్నించిన రిషభ్ పంత్‌ను ఉద్దేశించి రాహుల్ కీలక సలహా ఇచ్చాడు. బంతి చూసి ఆడాలని చెప్పాడు. దానికి పంత్ కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. గుడ్డిగా ఆడటం లేదని బంతిని చూసే ఆడుతున్నానని హిందీలో చెప్పాడు. 'ఇది గుడ్డిగా ఆడిన షాట్ కాదు. బంతిని చూసే ఆడాను'అని పంత్ తెలిపాడు. బ్రైడన్ కార్స్ వేసిన 33వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Rishabh Pant and KL Rahul s Conversation Goes Viral During India vs England 1st Test Video

కేఎల్ రాహుల్ సెంచరీ..

90/2 ఓవర్‌ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు అతను రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో పంత్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కండిషన్స్ బౌలింగ్‌‌కు అనుకూలంగా ఉండటంతో ఈ జోడీ ఓపికగా ఆడింది. ఈ క్రమంలో రాహుల్ 87 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.దాంతో భారత్ 153/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్‌లో పంత్ దూకుడుగా ఆడగా.. రాహుల్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.

83 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన పంత్ అనంతరం భారీ సిక్సర్లతు బాదాడు. మరోవైపు బషీర్ బౌలింగ్‌లో క్విక్ డబుల్ తీసి రాహుల్ 202 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మరోవైపు పంత్(90 బ్యాటింగ్) కూడా సెంచరీకి చేరువయ్యాడు. 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ 243/3 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

Story first published: Monday, June 23, 2025, 19:32 [IST]
Other articles published on Jun 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+