Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విషయంలో కోహ్లీని దాటేసిన రింకూ సింగ్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సంచలన ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఫినిషర్ రింకూ సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సోషల్ మీడియా వేదికగా అత్యధిక లైక్స్ అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాది సంచలన విజయాన్నందించిన రింకూ సింగ్.. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో సూపర్ హీరో‌‌గా అవతరించాడు. ఈ చారిత్రాత్మక ఫినిష్‌కు సోషల్ మీడియాలో అత్యధిక లైక్స్ లభించాయి. ఈ విషయంలో రింకూ సింగ్.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని కూడా వెనుకకు నెట్టాడు.

Rinku Singh

ఇక ఐపీఎల్ 2023 సీజన్‌లో మోస్ట్ పాపులర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ.. రింకూ సింగ్‌ ఫినిష్‌కు వచ్చిన లైక్స్‌ను కూడా అందుకోలేకపోయాడు. డిజిటల్ మార్కెటింగ్ ఏజన్సీ ఇంటరాక్టివ్ ఎవెన్యూస్ (Interactive Avenues) వివరాల ప్రకారం ఐపీఎల్ 2023 సీజన్‌లో సోషల్ మీడియాలో అత్యధికంగా చర్చించుకున్న ఆటగాడిగా.. . మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ గురించి 7 మిలియన్ల మంది చర్చించుకున్నారు. కోహ్లీ తర్వాత 6 మిలియన్లతో ధోనీ, 3 మిలియన్లతో రోహిత్ శర్మ ఉండగా.. జడేజా, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఒక్క మిలియన్ మెన్షన్లతో నాలుగో స్థానంలో నిలిచారు.

ఐపీఎల్ 2023 సీజన్ మోస్ట్ పాపులర్ టీమ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఆ జట్టు గురించి 7.6 మిలియన్ల మంది చర్చించుకున్నారు. గుజరాత్ టైటాన్స్(6.2 మిలియన్లు), ముంబై ఇండియన్స్(5.4 మిలియన్లు) తర్వాతి స్థానంలో ఉన్నాయి.

రింకూ సింగ్ సంచలన ఇన్నింగ్స్‌కు అత్యధిక లైక్స్ లభించాయి. గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్‌లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్స్‌లు బాది సంచలన విజయాన్నందించాడు. రింకూ దెబ్బకు దడుసుకున్న యశ్ దయాల్ జ్వరంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌.. రింకూ సింగ్‌ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ తీసుకొచ్చింది.

వెస్టిండీస్ పర్యటనలోని ఐదు టీ20ల సిరీస్‌కు రింకూ సింగ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.

Story first published: Monday, June 26, 2023, 16:44 [IST]
Other articles published on Jun 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+