Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయ గర్వం తలకెక్కింది.. రింకూ సింగ్‌పై తీవ్ర విమర్శలు!(వీడియో)

టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రింకూ సింగ్‌కు విజయ గర్వం తలకెక్కిందని నెటిజన్లు మండిపడుతున్నారు. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన రింకూ సింగ్‌కు కనీసం సంస్కారం లేదని ట్రోల్ చేస్తున్నారు.

తన ఇంట్లోని పూజ గది సమీపంలోకి రింకూ సింగ్ చెప్పులతో వెళ్లడం విమర్శలకు దారి తీసింది. వినాయకుడి విగ్రహం‌తో పాటు పలు దేవుళ్ల చిత్రపటాల ముందు ఉన్న తన కిట్ బ్యాగ్‌ను రింకూ సింగ్ స్లిప్పర్స్ విప్పకుండానే తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిది అనే విషయంపై క్లారిటీ లేదు.

చరిత్ర సృష్టించిన రింకూ సింగ్.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు

చరిత్ర సృష్టించిన రింకూ సింగ్.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు

ఈ వీడియోలో రింకూ సింగ్ ఫోన్ మాట్లాడుతూ తమ పూజ గది సమీపంలో ఉన్న కిట్ బ్యాగ్‌ను తీసుకున్నాడు. అయితే అతని కాళ్లకు స్లిప్పర్స్ ఉండటం వివాదాస్పదమైంది. ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రింకూ సింగ్‌ను తిడుతుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Rinku Singh Trolled After Picking Up His Kit Bag From Home Temple While Wearing Slippers

'రింకూ సింగ్‌ను చూడండి. తమ పూజ గదిలోని కిట్ బ్యాగ్‌ను చెప్పులు విడవకుండానే తీసుకుంటున్నాడు. కనీస సంస్కారం లేకపోతే ఎలా? నువ్వు ఎంత తోపు అయినా.. సంస్కృతిని మరవద్దు. దేవుళ్లను అగౌరవపర్చవద్దు.'అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. కొందరు మాత్రం రింకూ సింగ్ వ్యక్తిగత విషయాల గురించి ఎందుకని, మీ పని మీరు చూసుకోండని చురకలంటిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. దేవుడి ముందు చెప్పులేసుకొన్న రింకూ సింగ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విజయం ఆయనకు అంకితం.. కన్నీళ్లు పెట్టుకున్న రింకూ సింగ్ భార్య! (వీడియో)

Also Read

ఈ విజయం ఆయనకు అంకితం.. కన్నీళ్లు పెట్టుకున్న రింకూ సింగ్ భార్య! (వీడియో)

ప్రస్తుతం రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) ఆధ్వర్యంలో జరగనున్న యూపీటీ20 లీగ్‌ నాలుగో సీజన్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. శుక్రవారం ఈ టోర్నీకి తెరలేవనుండగా..మీరట్ మార్విక్స్ జట్టుకు రింకూ సింగ్ సారథ్యం వహిస్తున్నాడు. గత మూడు సీజన్లలో మీరట్ మార్విక్స్ జట్టు ఫైనల్ చేరడంతో పాటు టైటిల్ కూడా అందుకుంది. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలని తమ ఆటగాళ్లకు సూచించానని రింకూ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు దూరంగా ఉన్న రింకూ సింగ్‌.. జింబాబ్వే పర్యటనలో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండింటిలో బ్యాటింగ్ చేసిన రింకూ సింగ్ 12, 15 పరుగులతో పర్వాలేదనిపించాడు.

Story first published: Friday, August 14, 2026, 13:59 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+