Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

5 బంతుల్లో 3 సిక్సర్లు.. రింకూ సింగ్ విధ్వంసం చూశారా? (వీడియో)

డబ్లిన్: టీమిండియా యువ హిట్టర్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఐర్లాండ్‌తో రెండో టీ20లో కెరీర్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో సిక్సర్లు బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన రింకూ సింగ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు.

ఐపీఎల్ జోరును అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కొనసాగించాడు. తొలి 16 బంతుల్లో ఓ బౌండరీ సాయంతో 15 పరుగులే చేసిన రింకూ సింగ్ చివరి 5 బంతుల్లో వరుసగా 4,6, 6, 1, 6 బాది 23 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం రింకూ సింగ్ సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 Rinku Singh:

రింకూ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్‌కు శివమ్ దూబే కూడా రెండు భారీ సిక్సర్లు బాదడంతో టీమిండియా చివరి రెండు ఓవర్లలోనే 42 పరుగులు చేసింది. మెక్‌కార్తీ వేసిన 19వ ఓవర్‌లో రింకూ సింగ్ వరుసగా 6, 4 బాదడంతో ఒత్తిడికి గురైన మెక్‌కార్తీ వరుసగా రెండు వైడ్లు వేసాడు. అనంతరం రింకూ సింగ్ మరో సిక్సర్ బాది శివమ్ దూబే‌కు స్ట్రైక్ ఇవ్వగా అతను సింగిల్ తీసాడు. దాంతో ఈ ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి.

ఆఖరి ఓవర్‌లో శివమ్ దూబే వరుసగా రెండు సిక్స్‌లు బాది సింగిల్ తీయగా.. రింకూ సింగ్ ఓ సిక్సర్ బాది క్యాచ్ ఔటయ్యాడు. చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ సింగిలే తీయడంతో 20 పరుగులు వచ్చాయి. రింకూ సింగ్ బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇన్నాళ్లు రింకూ సింగ్‌ను ఎందుకు పక్కన పెట్టారని, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ కంటే అతను ఎంతో నయమని కామెంట్ చేస్తున్నారు.

రింకూ సింగ్‌‌ను ఆసియాకప్ 2023 టోర్నీకి ఎంపిక చేయాలని, ఫినిషర్‌గా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసియాకప్‌లో రాణిస్తే వన్డే ప్రపంచకప్ ఆడించాలని కోరుతున్నారు. ఎంతో నైపుణ్యం ఉన్న రింకూ సింగ్.. ధోనీలా మ్యాచ్‌లను ముగించగలడని, ఎంతటి ఒత్తిడిలోనైనా భారీ షాట్లు ఆడగలడని అభిప్రాయపడుతున్నారు.

కనీసం టీ20ల్లోనైనా అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(43 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 58)హాఫ్ సెంచరీతో రాణించగా.. రింకూ సింగ్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ ఇద్దరికి తోడుగా సంజూ శాంసన్(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), శివమ్ దూబే(16 బంతుల్లో 2 సిక్స్‌లతో 22 నాటౌట్) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెక్‌కార్తీ రెండు వికెట్లు తీయగా.. మార్క్ అడైర్, క్రైగ్ యంగ్, బెంజమన్ వైట్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, August 20, 2023, 22:29 [IST]
Other articles published on Aug 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+