Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆయన చెప్పిందే ఫాలో అవుతున్నా: రింకూ సింగ్

IND vs SA 1st T20I: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిందే తాను ఫాలో అవుతున్నానని నయా హిట్టర్ రింకూ సింగ్ అన్నాడు. సౌతాఫ్రికా‌తో టీ20 సిరీస్‌ ఆడేందుకు అక్కడికి వెళ్లిన రింకూ సింగ్.. ఆదివారం జరిగే తొలి టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్‌కు ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడినట్లు చెప్పాడు.

'సౌతాఫ్రికాతో సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. మా తొలి ప్రాక్టీస్ సెషన్ కూడా అద్భుతంగా జరిగింది. ఇక్కడి వాతావరణం కూడా చాలా బాగుంది. రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పని చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నాకు స్వేచ్చగా ఆడాలని చెప్పారు. ఎలా షాట్లు కొడతావో అలానే కొట్టేయ్ అన్నారు.

Rinku Singh shares what Rahul Dravid advised him Ahead Of 1st T20I Against South Africa

ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. అలాంటి స్థానంలో బ్యాటింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నదే. ఏ మాత్రం సెట్ అవ్వడానికి టైమ్ ఉండదు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే హిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో ఆడాలని ద్రవిడ్ సర్ సూచించారు.

దేశవాళీ క్రికెట్‌లో యూపీ తరఫున నేను ఇదే స్థానంలో చాన్నాళ్లు ఆడాను. నాకెంతో కలిసొచ్చిన స్థానం. నాలుగైదు వికెట్లు పడిన తర్వాత ఆడటమంటే ఎలాంటి బ్యాటర్‌కైనా కష్టమే. కానీ, దూకుడుగా ఆడటం చాలా కష్టం. సౌతాఫ్రికా సిరీస్‌లోనూ ఇదే ఫాలో అవుతా. ఇక జట్టులో రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, ఆవేశ్ ఖాన్‌లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం బాగుంది. సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగాలంటే ఫిట్‌గా ఉండటం ముఖ్యం'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో కేకేఆర్ తరఫున సంచలన ప్రదర్శన కనబర్చిన రింకూ సింగ్.. ఐర్లాండ్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లోనూ తన హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై కూడా చెలరేగితే టీ20 ప్రపంచకప్ 2024లో అతనికి చోటు ఖాయం. అయితే అతనికి జితేశ్ శర్మ రూపంలో పోటీ ఎదురవ్వనుంది. ఏ మాత్రం తడబడినా.. ఈ కేకేఆర్ హిట్టర్ వెనుకబడిపోతాడు.

Story first published: Saturday, December 9, 2023, 19:24 [IST]
Other articles published on Dec 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+