Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిక్సర్లతో సెలెక్టర్ల‌ను నిలదీసిన రింకూ సింగ్! (వీడియో)

న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంపై భారత యువ క్రికెటర్, కేకేఆర్ సూపర్ ఫినిషర్ రింకూ సింగ్ ఆగ్రహంగా ఉన్నాడు. టీమ్ ప్రకటించిన వెంటనే ఓ సెటైరికల్ కోట్‌తో సెలెక్షన్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన రింకూ సింగ్.. తాజాగా ఓ వీడియోతో తనను ఎందుకు పక్కనపెట్టారో సమాధానం చెప్పాలని నిలదీసాడు.

ప్రస్తుతం రింకూ సింగ్ షేర్ చేసిన వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే..? దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్.. రెండు ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 69 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసిన రింకూ.. రెండో ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు.

Rinku Singh shares his highlights of Duleep Trophy after Snubbed for West Indies T20Is

ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్‌ను రింకూ సింగ్ షేర్ చేశాడు. ఈ వీడియోలో రింకూ సింగ్ స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా విరుచుకుపడ్డాడు. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో చెలరేగాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడటం వచ్చని రింకూ సింగ్ చెప్పకనే చెప్పాడు. ఈ వీడియోపై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

సెలెక్టర్ల గూబ గూయ్‌మనేలా ఈ వీడియో ఉందని రింకూ సింగ్‌ను మెచ్చుకుంటున్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌లో రింకూ సింగ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. టీమ్ ప్రధాన ఆటగాళ్లు విఫలమైన వేళ రింకూ సింగ్ అసాధారణ ఆట తీరుతో జట్టుకు విజయాలు అందించాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ది బెస్ట్‌గా నిలిచిపోయింది.

చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది అసాధారణ విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో రింకూ సింగ్ టీమిండియాకు ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన టీ20 జట్టులో సెలెక్టర్లు రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. యశస్వీ జైస్వాల్‌తో పాటు తిలక్ వర్మను ఎంపిక చేశారు.

అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా రూపంలో మ్యాచ్ ఫినిషర్ ఉండటంతో రింకూ సింగ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత ద్వితీయ శ్రేణి జట్టులో రింకూ సింగ్‌కు అవకాశం దక్కనుంది.

దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్, వెస్ట్ జోన్ ఫైనల్ చేరాయి. రింకూ సింగ్ ప్రాతినిథ్యం వహించిన ఈస్ట్ జోన్ సెమీఫైనల్లోనే వెనుదిరిగింది. ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ ఫలితం తేలకుండా ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన వెస్ట్ జోన్‌కు ఫైనల్ బెర్త్ దక్కింది. జూలై 12(బుధవారం) నుంచి జరిగే ఫైనల్లో వెస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది.

Story first published: Monday, July 10, 2023, 20:38 [IST]
Other articles published on Jul 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+