Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విషయంలో కోహ్లీనే నెంబర్ వన్: రింకూ సింగ్

ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీనే నెంబర్ వన్ అని టీమిండియా నయా హిట్టర్ రింకూ సింగ్ అన్నాడు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీతో మరే ఆటగాడు పోటీ పడలేరని చెప్పాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లంతా కోహ్లీని చూసి ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రింకూ సింగ్.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఫామ్ కోల్పోయినప్పుడు ఎలా ఉండాలనే విషయంలో కోహ్లీ ఇచ్చిన సలహా తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ఫామ్ కోల్పోవడం ప్రతీ క్రికెటర్ జీవితంలో సర్వసాధారణమని, అతిగా ఆలోచించకుండా ఉండాలని కోహ్లీ సూచించాడని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.

Rinku Singh says Virat Kohli is the No 1 fit player

'క్రికెటర్ల‌కు మైండ్ సెట్ చాలా కీలకం. పరుగులు చేయనప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంచుకోవాలని కోహ్లీ భాయ్‌ని అడిగాను. ఆయన నాకు ఒక్కటే చెప్పాడు. ఎక్కువగా ఆలోచించకుండా నీ షాట్స్‌ ఆడామని తెలిపాడు. ఏ మాత్రం చికాకుకు గురికావద్దన్నాడు. ఈ సలహా నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఇలాంటి విషయాలు నేను కోహ్లీ నుంచే నేర్చుకున్నాను.

ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ నెంబర్ వన్ అని అందరికి తెలిసిందే. ఈ విషయంలో ప్రతీ ఒక్కరు కోహ్లీని స్ఫూర్తిగా తీసుకుంటారు. అతనిలా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. నేను కూడా ఫిట్‌గా ఉండేందుకు కోహ్లీ భాయ్ డైట్, ట్రైనింగ్‌ను అనుసరిస్తున్నాను. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ భాయ్‌తో కలిసి అఫ్గానిస్థాన్‌తో ఓ సిరీస్ ఆడాను. కానీ ఆయనతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు.

విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ప్రతీ ఒక్కరి కల. నాకు కూడా ఆయనతో కలిసి బ్యాటింగ్ చేయాలనుంది.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ సందర్భంగా కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌ను నెట్స్‌లో విరగొట్టానని చెప్పిన రింకూ సింగ్.. ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడ్డానని గుర్తు చేసుకున్నాడు.

'బ్యాట్ విరిగిన విషయం కోహ్లీకి చెప్పేందుకు నేను చాలా భయపడ్డాను. ఏం మాట్లాడకుండా వెళ్లి అతనికి విరిగిపోయిన బ్యాట్ చూపించాను. మీరిచ్చిన బ్యాట్ నెట్స్‌లో ఆడుతుండగా విరిగిపోయిందని చెప్పాను. కోహ్లీ భాయ్ మరో బ్యాట్ ఇస్తారని ఊహించలేదు. ఐపీఎల్ సందర్భంగా బెంగళూరులో కోహ్లీ భాయ్ నాకు మొదటి బ్యాట్ ఇచ్చాడు. నాకు మంచి బ్యాట్ కావాలని చెప్పాను. వెంటనే కోహ్లీ భాయ్‌ నాకు బ్యాట్ ఇచ్చాడు. ఆ బ్యాట్‌తో నెట్స్‌‌లో బిగ్ షాట్స్ ఆడుతుండగా విరిగిపోయింది. 'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, August 27, 2024, 17:39 [IST]
Other articles published on Aug 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+