Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఒక్క ఇన్‌స్టా లైక్‌తో ప్రియ సరోజ్‌ను ప్రేమలోకి దించా: రింకూ సింగ్

సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో టీమిండియా టీ20 సెన్సేషన్ రింకూ సింగ్‌కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్‌తో రాజకీయ కుటుంబానికి చెందిన ప్రియ సరోజ్ ఎలా పరిచయమైందని, ఈ వివాహం ఎలా సెట్ అయ్యిందని అంతా ఆశ్చర్యపోయారు. పెద్దలు కుదిర్చిన వివాహమని చాలా మంది అనుకున్నారు. కానీ తాము సుదీర్ఘ కాలంగా ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రింకూ సింగ్ తెలిపాడు. తొలి చూపుల్లోనే ప్రియ సరోజ్‌‌పై ప్రేమ పుట్టిందని, కానీ చెప్పేందుకు ధైర్యం సరిపోలేదంటూ తన లవ్ స్టోరీకి సంబంధించిన వివరాలను పంచుకున్నాడు.

ఫొటోను చూసి..

'మూడేళ్ల క్రితం(2022) కరోనా సమయంలో ఓ ఫ్యాన్ పేజీలో ప్రియా సరోజ్‌ ఫొటోను తొలిసారి చూశాను. చూసిన వెంటనే ఆమెపై ప్రేమ కలిగింది. తనకు సరైన భాగస్వామి అనిపించింది. దాంతో ఆమె ఎవరా? అనే వివరాలను సేకరించాను. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో తన ప్రేమ విషయం చెప్పేందుకు భయపడ్డాను. కొన్ని రోజులకు నా ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫొటోలను ప్రియ సరోజ్ లైక్ చేసింది. అది చూసి ఆనందపడ్డ నేను ఆమెకు ఇన్‌స్టా వేదికగా మెసేజ్ చేశాను. అలా మొదలైన మా పరిచయం చివరకు ప్రేమగా మారింది. ప్రతీ రోజు మాట్లాడుకునేవాళ్లం. అలా కొద్దిరోజులు గడిచాక పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చాం.

Rinku Singh Opens Up About His Fairytale Love Story with MP Priya Saroj

ఎంపీగా గెలిచినా..

అదే సమయంలో ప్రియ ఎంపీగా బాధ్యతలు స్వీకరించింది. అయినప్పటికీ తమ మధ్య ఉన్న ప్రేమలో మాత్రం ఏ మార్పు రాలేదు. అయితే ఆమె ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ఉండటం, పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూ బిజీగా ఉండేది. నేను కూడా తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడటంతో మాట్లాడుకోవడానికి ఎక్కువ సమయం దొరికేది కాదు. దాంతో రాత్రి వేళల్లోనే మాట్లాడుకునేవాళ్లం. వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ.. అవసరమైన సమయంలో తగిన సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకునేవాళ్లం. ఆ తర్వాత పెద్దలకు మా ప్రేమ విషయాన్ని చెప్పి వారి అంగీకారంతో పెళ్లి చేసుకునేందుకు ఒక్కటయ్యాం. మా నిశ్చితార్థానికి కేకేఆర్ ఓ ఓనర్ షారుఖ్ ఖాన్‌ను ఆహ్వానించాం. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన రాలేకపోయారు.'అని రింకూ సింగ్ తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు.

35 వేల ఓట్లతో విజయం..

2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మచిలీషహర్ నుంచి ప్రియ సరోజ్ ఎంపీగా ఎన్నికైంది. బీజేపీ అభ్యర్థి బీపీ సరోజ్‌ను 35 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించింది. ఆర్డ్స్ న్యాయవాద విద్యలో ప్రియ సరోజ్ డిగ్రీ పూర్తి చేసింది. మరోవైపు రింకూ ఆసియా కప్ 2025 కోసం సిద్దమవుతున్నాడు. గతేడాదిగా అతను పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం యూపీ వేదికగా జరుగుతున్న టీ20 లీగ్‌లో రింకూ సింగ్ సెంచరీతో చెలరేగి ఫామ్ అందుకున్నాడు.

Story first published: Saturday, August 23, 2025, 13:11 [IST]
Other articles published on Aug 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+