Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రింకూ సింగ్ డకౌట్! వరుస మ్యాచ్‌ల్లో ఖాతా తెరవని సిక్సర్ల సింగ్!

టీమిండియా యువ హిట్టర్ రింకూ సింగ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక టెస్ట్‌లో రింకూ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రింకూ సింగ్ 5 బంతులాడి ఖాతా తెరవకుండా ఎల్బీగా వెనుదిరిగాడు. గత మ్యాచ్‌లోనూ రింకూ సింగ్ డకౌటవ్వడం విశేషం.

అప్పుడు 4 బంతులాడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. టీ20ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగే రింకూ.. సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో అసాధారణ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్.. అసాధారణ ప్రదర్శనతో సంచలన విజయాలు అందించాడు.

Rinku Singh dismissed for duck in India A vs England Lions 3rd unofficial test

అఫ్గానిస్థాన్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో‌నూ ఫినిషర్‌గా సత్తా చాటాడు. మూడు మ్యాచ్‌ల్లో 16 నాటౌట్, 9 నాటౌట్, 69 నాటౌట్‌తో చెలరేగాడు. ఈ ప్రదర్శనతో భారత్-ఏ జట్టుకు ఎంపికైన రింకూ సింగ్.. ఏకంగా విరాట్ కోహ్లీ ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం అందుకున్నాడు. కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు.

రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో రింకూ సింగ్ తనదైన శైలిలో చెలరేగి ఉంటే.. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు ఎంపికయ్యేవాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టెస్ట్‌ల్లో మిడిలార్డర్‌లో సత్తా చాటేవారు లేక టీమిండియా ఇబ్బంది పడుతోంది.

తాజా మ్యాచ్‌లో రింకూ సింగ్‌తో పాటు ఇతర బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. దేవదత్ పడిక్కల్(65), సరన్ష్ జైన్(64) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌‌లో 192 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పోట్స్(6/57) ఆరు వికెట్లతో భారత్ ఏ పతనాన్ని శాసించాడు. బ్రిడన్ కార్స్(4/52) నాలుగు వికెట్లు తీసాడు.

Story first published: Thursday, February 1, 2024, 15:45 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+