Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓలీ రాబిన్సన్.. ఈ ఓవరాక్షనే తగ్గించుకో! రికీ పాంటింగ్ చురకలు!

లండన్: ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్సన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ మండిపడ్డాడు. మైదానంలో ఓవరాక్షన్ తగ్గించుకొని బౌలింగ్‌పై ఫోకస్ పెట్టాలని చురకలంటించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో శుభారంభం చేసిన ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ చివరి రోజు నిలకడగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్‌ ఉస్మాన్ ఖవాజాను ఓలీ రాబిన్సన్ తన మాటలతో కవ్వించే పని చేశాడు. రాబిన్సన్ స్లెడ్జింగ్ హద్దులు ధాటడంతో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ అతన్ని పక్కకు తీసుకెళ్లాడు.

Ricky Ponting slams Ollie Robinson

ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం కాగా.. మ్యాచ్ అనంతరం ఓలీ రాబిన్సన్‌ను అధికారిక బ్రాడ్‌కాస్టర్ హోస్ట్ వివరణ కోరాడు. ‌తన స్లెడ్జింగ్‌ను సమర్ధించుకునే ప్రయత్నం చేసిన ఓలీ రాబిన్సన్.. గతంలో తమ జట్టుపైనా రికీ పాంటింగ్‌ సహా ఇతర ఆసీస్‌ ఆటగాళ్లు ఇలానే కవ్వింపులకు పాల్పడ్డారని పేర్కొన్నాడు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన రికీ పాంటింగ్‌.. రాబిన్సన్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్లెడ్జింగ్ వివాదంలోకి తన పేరును లాగాల్సిన అవసరం ఏం ఉందన్నాడు. 'ఓలీ రాబిన్సన్‌ మాట్లాడిన తీరు ఏ మాత్రం సరికాదు. నా పేరు ప్రస్తావించాడు కాబట్టి అతని గురించి నేను మాట్లాడుతున్నా. ఆస్ట్రేలియాతో ఇలాంటి ఇంగ్లండ్‌ జట్టు ఆడలేదు.

నాణ్యమైన ఆస్ట్రేలియా జట్టుతో యాషెస్ క్రికెట్‌ అంటే ఏంటో రాబిన్సన్ వేగంగా అర్థం చేసుకోవాలి. గతవారమే ఓలీ రాబిన్సన్ నేర్చుకోలేకపోయాడు. అతను కాస్త నెమ్మదిగా నేర్చుకుంటాడనుకుంటున్నా. యాషెస్‌లో ఆసీస్ క్రికెటర్లపై స్లెడ్జింగ్‌కు దిగాలనుకుంటే ముందు బౌలింగ్‌ ప్రదర్శన మెరుగ్గా ఉండేలా చూసుకో. మ్యాచ్‌ అనంతరం ఏదో చెప్పానులనుకుని నా పేరును ప్రస్తావించాడు.

అలా మాట్లాడి ఉండాల్సింది. అయితే, అలాంటి వ్యాఖ్యలతో నాకు జరిగే నష్టం ఏం లేదు. ఒకవేళ నా గురించి అతను ఆలోచించాలనుకుంటే గత 15 ఏళ్ల కిందట వరకు నేనేం చేశానో తెలుసుకుంటే సరిపోతుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లతో మాట్లాడాలనుకుంటే మాత్రం కాస్త త్వరగా బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాలి. ఈ ఓవరాక్షన్‌ తగ్గించుకొని నీ నైపుణ్యాలకు పదును పెడితే బాగుంటుంది'' అని రికీ పాంటింగ్‌ సూచించాడు.

ఈ మ్యాచ్‌లో రాబిన్సన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 98 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఖవాజాను మాత్రం రాబిన్సన్ బౌల్డ్‌ చేశాడు.

Story first published: Thursday, June 22, 2023, 20:13 [IST]
Other articles published on Jun 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+