‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’: రికీ పాంటింగ్

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ సహచర కోచ్‌లకు విలువైన సలహా ఇచ్చాడు. యువ ఆటగాళ్ల పట్ల ప్రేమను చూపిస్తే వాళ్లు కూడా తిరిగి ప్రేమిస్తారని చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో ఇప్పటికే జట్టుతో కలిసిన రికీ పాంటింగ్.. తమ టీమ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు ఓ పెద్ద బాధ్యత అప్పగించాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లను నడిపించే బాధ్యత ఈ రిటైన్ ప్లేయర్స్‌దేనని చెప్పాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్‌తో పాటు పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్‌లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
సాన్నిహిత్యం పెంచుకోవాలి..
అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో పాంటింగ్ మాట్లాడుతూ.. జట్టులోని ఆటగాళ్లు ఒకరికొకరు సాన్నిహిత్యం పెంచుకోవాలని సూచించాడు. తమ రూమ్స్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంచాలని చెప్పాడు. 'ఆరంభ మ్యాచ్ నుంచే ఆటగాళ్ల దృష్టంతా ఆటపైనే ఉండాలి. కొత్త టీమ్‌తో ఫస్ట్ సెషన్ బాగా సాగింది. జట్టులో తెలియని ఎనర్జీ కనిపిస్తోంది. గదుల్లో ఉన్నప్పుడు తలుపులు తెరిచే ఉంచమని మా ఆటగాళ్లకు చెబుతుంటా. ఎందుకంటే అప్పుడే మిగిలినవాళ్లు ఎప్పుడంటే అప్పుడు రావడానికి, వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

ప్రేమను చూపిస్తే.. తిరిగిస్తారు..
మిగతా వాళ్లతో సాన్నిహిత్యం పెంచుకోమని ఆటగాళ్లతో చెప్పాను. నాకు తెలియని కుర్రాళ్లతో కలిసి అల్పాహారం తీసుకుంటా. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా వారితో పాటే చేస్తా. ఒక కోచ్‌గా లేదా సీనియర్ ఆటగాడిగా యువ ఆటగాళ్ల పట్ల ప్రేమను చూపిస్తే.. వాళ్లు కూడా తిరిగి ప్రేమిస్తారు. కొంత కాలంగా ఢిల్లీ జట్టులో ఉన్న ఆటగాళ్లపై జట్టులోని కుర్రాళ్లను నడిపించాల్సిన బాధ్యత తప్పక ఉంటుంది. రిషభ్ పంత్ కెప్టెన్ కాబట్టి ఆ పని ఎలాగూ చేస్తాడు. పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్‌లకు వాళ్ల పాత్రలు, బాధ్యతలు వాళ్లకు ఉంటాయి'' అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

రిషభ్ పంత్ ఓ ఉదహారణ..
ఇక రికీ పాంటింగ్ ఆటగాళ్లతో ఎంత చనువుగా ఉంటాడనే విషయాన్ని రిషభ్ పంతే ఉదహారణ. గత సీజన్‌లో మ్యాచ్ జరుగుతుండగా రికీ పాంటింగ్ బ్రాడ్‌కాస్టర్ కామెంటేటర్స్‌తో మాట్లాడుతుండగా.. అతని వెనుకాల నిలుచున్న పంత్ పాంటింగ్‌ను ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే.
దీన్ని పాంటింగ్ సైతం సరదాగా తీసుకోగా పక్కనున్న వాళ్లంతా పగలబడి నవ్వారు. యువ ఆటగాళ్లతో పాంటింగ్ అంత చనువుగా ఉంటాడు. కోచ్ అనేవాడు బెత్తం పట్టుకునేవాడిలా కాకుండా రికీ పాంటింగ్‌లా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు అనడం గమనార్హం. గతేడాది టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరలేకపోయింది. ఈ సారి ఆ కలను నెరవేర్చుకోవాలని భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications