Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహమ్మద్ షమీ కంటే తోపు బౌలర్లు టీమిండియాలో ఉన్నారు: రికీ పాంటింగ్

Ricky Ponting Says There are better fast bowlers in Indian T20 cricket than Mohammed Shami

దుబాయ్: మహమ్మద్ షమీ కంటే అత్యుత్తమమైన పేసర్లు భారత జట్టులో ఉన్నారని ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. షమీ సుదీర్ఘ ఫార్మాట్‌కు సూటయ్యే బౌలరని, టీ20 క్రికెట్‌లో అతనికంటే మెరుగైన క్విక్ బౌలర్లు ఉన్నారని తెలిపాడు. ఆసియాకప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కని విషయం తెలిసిందే. స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల బారిన పడటంతో సెలెక్టర్లు భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌లను ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఈ ముగ్గురు పేసర్లు బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు. అయితే బుమ్రా గైర్హాజరీలో షమీని ఎంపిక చేయకపోవడాన్ని కొందరు మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.

షమీ కంటే తోపులు..

షమీ కంటే తోపులు..

అయితే ఈ విమర్శలను పాంటింగ్ కొట్టిపారేసాడు. తాజాగా ఐసీసీ రివ్యూ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. షమీ కంటే తోపు బౌలర్లు భారత్‌లో ఉన్నారని చెప్పాడు. ‘మహమ్మద్ షమీ సుదీర్ఘ కాలంగా టీమిండియాకు ఆడుతున్న అద్భుతమైన బౌలర్. అయితే అతని బలం టెస్ట్ క్రికెట్‌కే సెట్ అవుతోంది. అతని కంటే మెరుగైన బౌలర్లు భారత టీ20 క్రికెట్‌లో ఉన్నారు. అందులో నుంచి ముగ్గురిని మాత్రమే బీసీసీఐ ఆసియాకప్‌కు ఎంపిక చేసింది. నలుగురిని తీసుకొని ఉంటే షమీకి అవకాశం దక్కేదేమో.

 భారత్‌దే ఆసియా కప్..

భారత్‌దే ఆసియా కప్..

నలుగురు క్విక్ బౌలర్లను మాత్రమే ఆస్ట్రేలియాకు తీసుకువస్తారని భావిస్తున్నా. ఇక్కడి వికెట్లు అనుకూలించకున్నా.. స్పిన్ బౌలర్లతో టర్న్ రాబట్టే ప్రయత్నం చేయవచ్చు. ఆసియా కప్‌లోనే కాదు ఏ టోర్నీలో అయినా భారత్‌ను ఓడించడం చాలా కష్టం. టీ20 ప్రపంచకప్ వచ్చిన ప్రతీసారి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఈ సారి ఇండియా సరైన ట్రాక్‌లో నడుస్తుందనిపిస్తోంది. వారి డెప్త్ ఇతర జట్ల కంటే చాలా బాగుంది. ఆసియాకప్‌ను భారతే గెలుస్తుందని భావిస్తున్నా.

 ఆ క్రేజ్ వేరు..

ఆ క్రేజ్ వేరు..

గత 15-20 ఏళ్లుగా.. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. క్రికెట్‌ చరిత్రలో ఈ ఇరు జట్లు ఎప్పటికి చిరకాల ప్రత్యర్థులుగానే అభిమానులు చూస్తారు. ఒక క్రికెట్‌ లవర్‌గా నేను చెప్పేది ఏంటేంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను కూడా చిరకాల ప్రత్యర్థులగానే చూసినప్పటికీ... అది యాషెస్‌ లాంటి టెస్టు సిరీస్‌కు మాత్రమే పరిమితం అవుతోంది. కానీ భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉన్న ఆధిపత్య ధోరణి అలా ఉండదు. వన్డే, టెస్టు, టీ20 ఇలా ఏదైనా చిరకాల ప్రత్యర్థులుగానే పరగణిస్తారు. ఇరు దేశాల అభిమానులు భావోద్వేగంతో వీక్షిస్తారు. అందుకే ఈ మ్యాచ్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

T20 ప్రపంచకప్‌కు వాళ్లిద్దరూ దూరం,మరెలా? *Cricket | Telugu OneIndia
భారత్‌దే విజయం

భారత్‌దే విజయం

ఇక ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేత ఎవరంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్‌ వంటి మేజర్‌ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత్‌ ఆధిపత్యం ఎక్కువగా ఉంటే.. ఆసియా కప్‌లో మాత్రం ఇరుజట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆసియా కప్‌లో 13 సార్లు తలపడితే.. భారత్‌ ఏడు గెలిస్తే.. పాకిస్తాన్‌ ఐదు గెలవగా.. ఒక మ్యాచ్‌ ఫలితం రాలేదు. కానీ నా అంచనా ప్రకారం టీమిండియానే గెలుస్తుందనుకుంటున్నా. ఆగస్టు 28న జరగబోయే మ్యాచ్‌లో టీమిండియానే ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్‌ మంచి ఆటను కనబరుస్తున్నప్పటికి ఒత్తిడిలో చిత్తవుతుందేమో అనిపిస్తుంది.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, August 13, 2022, 16:39 [IST]
Other articles published on Aug 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+