
కీపింగ్ వైఫల్యం..
తొలిరోజు ఆట ముగిసాక పాంటింగ్.. పంత్, పుకోస్కీ ప్రదర్శన గురించి మీడియాతో మాట్లాడాడు. 'టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రపంచంలో మరే కీపర్ వదిలేయనన్ని క్యాచ్‌లను పంత్ జారవిడిచాడు. అతని కీపింగ్ వైఫల్యాన్ని, మరింత మెరుగవ్వాల్సిన అవసరాన్ని ఇది ఎత్తిచూపుతోంది. తొలిరోజు వదిలేసిన రెండు క్యాచ్‌లు నిజానికి అందుకోవాల్సినవి. ఎందుకంటే అవెంతో తేలికైన క్యాచులు.'అని పాంటింగ్ అన్నాడు. పుకోస్కీ గానీ ఔటవ్వకపోయుంటే కచ్చితంగా భారీ శతకం లేదా ద్విశతకం చేసేవాడని రికీ నొక్కి చెప్పాడు.

పుకోస్కీ ఔటయ్యాడు..
'పిచ్‌ను చూస్తుంటే పంత్ బతికిపోయాడనే చెప్పొచ్చు. లేదంటే పుకోస్కీ భారీ శతకం లేదా ద్విశతకం కచ్చితంగా చేసేవాడు. ఎందుకంటే వికెట్ నమ్మశక్యం కానంత బాగుంది. ఆ రెండు క్యాచులు వదిలేయగానే అతని ప్రదర్శన గురించి పంత్ చెత్తగా అనుకొని ఉంటాడు. 'ఇక నా పని అయిపోయినట్టే. పుకోస్కీ నాకు తగిన మూల్యం చెల్లిస్తాడు' అని ఆలోచించి ఉంటాడు. కానీ అలా జరగలేదు. పంత్ కీపింగ్‌పైనే ఆందోళన నెలకొందని నేనెప్పటి నుంచో చెబుతున్నా'' అని పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీకి ఆడుతున్న పంత్‌కు కోచ్ పాంటింగ్ అన్న సంగతి తెలిసిందే.

పుకోస్కీ హాఫ్ సెంచరీ..
సిడ్నీ టెస్టులో అరంగేట్రం చేసిన విల్ పుకోస్కీ 26, 32 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచులను పంత్ చేజార్చాడు. దాంతో ఎంతో కష్టపడి బౌలింగ్ వేసిన అశ్విన్, సిరాజ్ అసంతృప్తికి గురయ్యారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న పుకోస్కీ( 110 బంతు్లో 62) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతనిచ్చిన క్యాచ్‌లు పంత్ పట్టుంటే.. ఆసీస్ ఆదిలోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడేది. కానీ పుకోస్కీ ఆరంభంతో.. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

ఆసీస్ 166/2
వర్షం అంతరాయంతో 55 ఓవర్ల ఆటనే సాగగా.. నిలిచే సమయానికి ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్( 149 బంతుల్లో 8 ఫోర్లతో 67 బ్యాటింగ్ ), స్టీవ్‌స్మిత్(64 బంతుల్లో 5 ఫోర్లతో 31 బ్యాటింగ్ ) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా ఓపెనర్లలో డేవిడ్ వార్నర్(5) విఫలమైనా, పకోస్కీ(110 బంతుల్లో 4 ఫోర్లతో 62) అర్ధశతకంతో రాణించాడు.


Click it and Unblock the Notifications












