Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్, కోహ్లీకి నో చెప్పొద్దు: రికీ పాంటింగ్

భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఎప్పుడూ నో చెప్ప వద్దని ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్, పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఈ ఇద్దరూ ఛాంపియన్లని, వారిని ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దని అభిప్రాయపడ్డాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి రోహిత్, కోహ్లీ.. ఐపీఎల్‌తో పాటు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

వన్డే ఫార్మాట్‌తో పాటు ఐపీఎల్‌ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతుండగా.. రోహిత్ శర్మ పర్వాలేదనిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 కిలోల బరువు తగ్గి సూపర్ ఫిట్ అయ్యాడు. అయితే ఐపీఎల్‌లో తొడ కండరాల గాయానికి గురై కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్.. రీఎంట్రీ ఇచ్చి ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడు.

Ricky Ponting Says Rohit Sharma Virat Kohli doing everything to last till 2027 World Cup

ఆడినంత కాలం కొనసాగించాలి..

అయితే ఈ ఇద్దరికీ వన్డే ప్రపంచకప్ 2027 జట్టులో చోటు గ్యారెంటీ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన రికీ పాంటింగ్.. విరాట్ కోహ్లీ, రోహిత్‌లను వారు ఆడినంత కాలం జట్టులో కొనసాగించాలని సూచించాడు.

'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కెరీర్‌ను ముందుకు నడిపిస్తూ వన్డే ప్రపంచకప్ ఆడేందుకు సిద్దమవుతున్నారు. ఛాంపియన్ ఆటగాళ్ల గురించి నేను ఎప్పుడూ చెప్పే విషయం ఒకటే.. వారికి ఎప్పుడూ నో చెప్పకూడదు. వారిని ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు.

ఆ తపన ఇప్పటికీ ఉంది..

ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తుండటమే అందుకు మంచి ఉదాహరణ. అతను ఒకప్పుడు ఆడినంతగా అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. ఆ పట్టుదల గెలవాలనే తపన ఇప్పటికీ ఉన్నాయి. రోహిత్ శర్మ గతంలో ఎన్నడూ చూడనంతగా ఫిట్‌గా మారాడు.

ఈ ఐపీఎల్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. మరింత ముందుకు సాగి తమను తాము అత్యుత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దుకోవాలనే కసి ఈ ఇద్దరిలో ఇంకా ఉంది. అందుకే వారు ఆడినంత కాలం జట్టులో కొనసాగించాలి.'అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.

అఫ్గాన్‌తో వన్డే సిరీస్..

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే అఫ్గానిస్థాన్‌తో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు మొదలవ్వనున్నాయి. ఈ సిరీస్‌కు కోహ్లీతో పాటు రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. కానీ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే బరిలోకి దిగుతాడని సెలెక్టర్లు తెలిపారు.

Story first published: Thursday, May 21, 2026, 22:11 [IST]
Other articles published on May 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+