Rishabh Pant చాలా డేంజర్.. అతన్ని అలా వాడుకుంటే బౌలర్లకు చుక్కలే: రికీ పాంటింగ్

ముంబై: టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఆ జట్టు కోచ్, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పంత్ అత్యంత ప్రమాదకరంగా మారతాడని పాంటింగ్ తెలిపాడు. పాస్ట్, బౌన్సీ వికెట్లపై అతన్ని అడ్డుకోవడం బౌలర్లకు కత్తిమీద సామేనని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్లుగా పంత్‌ను పరుగుల ప్రవాహాన్ని కొనసాగించే ఆటగాడిగా వాడుకోవాలని అతను చెప్పాడు.

చాలా డేంజర్‌గాడు..
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పాంటింగ్.. పంత్ ఆటను దగ్గర నుంచి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీసీతో మాట్లాడిన అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.' రిషభ్ పంత్ ఓ అద్భుతమైన ఆటగాడు. ప్రపంచాన్ని తన పాదాల చెంతకు తెచ్చుకునే అసాధారణమైన యువ బ్యాటర్. భారత్ తరపున అత్యంత ప్రమాదకారి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో తయారుచేసే ఫ్లాట్, ఫాస్ట్, బౌన్సీ వికెట్లపై అతను చెలరేగగలడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో చూడాల్సిన ఆటగాళ్లతో కచ్చితంగా అతనొకడు.

ఐదో స్థానంలో ఆడిస్తే...
పరుగుల ప్రవాహాన్ని కొనసాగించే ఆటగాడిగా అతణ్ని ఉపయోగించుకోవాలి. నేనైతే భారత బ్యాటింగ్ ఆర్డర్లో అతణ్ని అయిదో స్థానంలో ఆడిస్తా. కానీ ఏడెనిమిది ఓవర్ల ఆట మిగిలి ఉండి.. ఒకటి లేదా రెండు వికెట్లు పడ్డ సందర్భంలో అతణ్ని ముందు పంపించాలి. తనకు వీలైనంత సమయం ఇవ్వాలి. అతనో విధ్వంసకర ఆటగాడు'' అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

చాలా చిరాకు పడ్డాడు..
ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో 340 పరుగులే చేసాడు. తన ప్రదర్శన పట్ల పంత్ చాలా చిరాకు పడ్డాడని పాంటింగ్ తెలిపాడు. ''ఈ సారి ఐపీఎల్‌లో పంత్ ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయాడు. అందుకు అతనెంతో చిరాకు పడ్డాడు. ఎందుకంటే గతంలో కంటే కూడా ఉత్తమ బ్యాటర్‌గా అతనీ సీజన్‌లో అడుగుపెట్టాడు. కానీ అతను కోరుకున్న ఫలితం రాలేదు'' అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications